Shankar Dada MBBS : ఇన్‌ఫ్రాంట్ దేర్ ఈజ్ కామెడీ కార్నివాల్‌.. ‘శంకర్ దాదా’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్..

టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఒకటిగా ఎదురు చూస్తున్న రీ రిలీజ్‌ల్లో 'శంకర్ దాదా ఎంబిబిఎస్' ఒకటి. తాజాగా ఈ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

Chiranjeevi Shankar Dada MBBS re release date update

Shankar Dada MBBS : టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఒకటిగా ఎదురు చూస్తున్న రీ రిలీజ్‌ల్లో ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కామెడీ అండ్ ఎమోషనల్ చిత్రంగా 2004లో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించింది. బాలీవుడ్ మూవీ ‘మున్నా భాయ్ ఎంబిబిఎస్’కి ఇది రీమేక్ గా వచ్చింది. జయంత్ పరాంజీ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. హీరోయిన్ గా సోనాలి బింద్రే, విలన్ పాత్ర ‘లింగం మావ’గా పరేష్ రావల్ నటించారు. ఇక ఈ సినిమాలో శంకర్ దాదాగా చిరంజీవి, ఏటీఎంగా శ్రీకాంత్ చేసిన సందడి అంతాఇంతా కాదు.

చిరంజీవి ఇంగ్లీష్ పదాలతో సమేతులు చెబుతుంటే థియేటర్స్ లో ఆడియన్స్ అంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. లవ్ ఫెయిల్యూర్ బాధ పడుతున్న కుర్రాడు, కుటుంబం కోసం బ్రతకాలి అనుకునే క్యాన్సర్ పేషెంట్, డాక్టర్ అయినా తండ్రిని కాపాడుకోలేని కొడుకు, నాన్నకి చెప్పిన అబద్దాన్ని నిజం చేయాలనుకునే హీరో.. ఇలా మనిషి జీవితంలోని కొన్ని ప్రధాన సమస్యలను సినిమాలో చాలా ఎంటర్‌టైనింగ్ చూపించారు. ఆనందమే ఆరోగ్యం అని తెలియజేసే ప్రయత్నం చేశారు.

Also read : Vijay Deverakonda : నాన్నగా కనిపించబోతున్న విజయ్ దేవరకొండ..? పిక్ వైరల్..!

ఇక ఈ సినిమాకి మరో హైలైట్ అంటే.. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్. సినిమాలోని ప్రతి పాట సూపర్ హిట్. ఆ పాటలకి చిరంజీవి వేసిన డాన్స్ మరో ఆకర్షణ. ఇక ఈ మూవీ రీ రిలీజ్ కోసం టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరందరి ఆశని చూసిన శంకర్ దాదా.. ఇన్‌ఫ్రాంట్ దేర్ ఈజ్ రీ రిలీజ్ ఫెస్టివల్ అంటూ డేట్ ప్రకటించేశాడు. నవంబర్ 4న ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ అంతా రెడీ అవ్వండి కామెడీ కార్నివాల్‌కి.