Chiranjeevi : భారతీరాజా చిరంజీవితో తీసిన ఒకేఒక్క సినిమా ఏంటో తెలుసా? ఆయన మరణంతో చిరు ఎమోషనల్ ట్వీట్..
తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఒకేఒక్క సినిమా చేశారు భారతీరాజా. (Chiranjeevi)
- Saketh U
- Updated on- June 10, 2026 / 11:11 AM IST
Chiranjeevi
Chiranjeevi : లెజెండరీ తమిళ దర్శకుడు భారతీరాజా నేడు ఉదయం మరణించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తెలుగులో కూడా ఆయన పలు సినిమాలను డైరెక్ట్ చేశారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఒకేఒక్క సినిమా చేశారు భారతీరాజా.
తమిళ్ లో ఆయన తీసిన కడలోరా కవితైగల్ అనే సినిమాని తెలుగులో ఆరాధన అనే పేరుతో తీశారు. చిరంజీవి, సుహాసిని జంటగా రాజశేఖర్, రాధికా కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా 1987 లో రిలీజ్ అయింది. సినిమా కలెక్షన్స్ పరంగా యావరేజ్ గా నిలిచినా ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాల్లో నిలిచింది. అరె ఏమైంది.. అనే సూపర్ హిట్ సాంగ్ ఈ సినిమాలోదే. ఈ సినిమాలో చిరంజీవి, సుహాసిని పర్ఫార్మెన్స్ లను మెచ్చుకోకుండా ఉండలేము. ఆరాధన క్లైమాక్స్ లో అయితే చిరంజీవి జీవించేసాడు. చిరు కెరీర్ లో అంత మంచి సినిమా ఇచ్చారు భారతీరాజా.
Also Read : Rajinikanth : రజినీకాంత్ – భారతీరాజా వివాదం.. రజినినీ ఎంత చిన్నచూపు చూసారో తెలుసా..?
దర్శకుడు భారతీరాజా మరణంతో చిరంజీవి ఆయనతో ఓ సినిమా ఈవెంట్లో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. భారతీయ చలనచిత్రరంగం తన గొప్ప కథకులలో ఒకరైన భారతీరాజా గారిని కోల్పోయింది. గ్రామీణ జీవన సౌరభం, మానవ సంబంధాల అందం, ప్రేమలోని స్వచ్ఛత మరియు సామాన్య ప్రజల భావోద్వేగాలను ఆయన అద్భుతమైన దృశ్యకావ్యాలుగా మలిచారు. ఆయన చిత్రాలు కోట్లాది మంది హృదయాలను తాకాయి మరియు ఎన్నో తరాల సినీ సృష్టికర్తలకు స్ఫూర్తినిచ్చాయి. ప్రతిష్టాత్మక పద్మశ్రీ మరియు అనేక జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్న భారతీరాజా గారి సేవలు భారతీయ సినిమాకు వెలకట్టలేనివి.
‘ఆరాధన’ చిత్రంలో ‘పులిరాజు’ పాత్రలో ఆయన దర్శకత్వంలో పనిచేసే అదృష్టం నాకు కలిగింది. సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం, సరళత మరియు పని పట్ల ఆయనకున్న నిబద్ధత నాపై చెరగని ముద్ర వేశాయి. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన అద్భుతమైన చిత్రాల ద్వారా ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది. దర్శక దిగ్గజం భారతీరాజా గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Also Read : Bharathiraja : చివరి సినిమాలో మరణం.. ఇప్పుడు రియల్ లైఫ్ లో..
Indian cinema has lost one of its greatest storytellers, #Bharathiraja garu.
He transformed the fragrance of village soil, the beauty of human relationships, the innocence of love, and the emotions of ordinary people into timeless cinematic poetry. His films touched millions of… pic.twitter.com/MdoUfpztji
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2026
