Chiranjeevi – Niharika: కొణిదెల వారి గారాల పట్టి నిహారిక వివాహం మరికొద్ది గంటల్లో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో జరుగబోతోంది. డిసెంబర్9, బుధవారం రాత్రి 7:15 నిమిషాలకు మిథున లగ్నంలో వీరిద్దరూ ఒకటి కానున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 11, శుక్రవారం నాడు హైదరాబాద్, జెఆర్సీ కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
నిహారిక పెళ్లి చేసుకుని మరో మెట్టినింట అడుగుపెట్టబోతున్న సందర్భంగా తండ్రి నాగబాబు భావోద్వేగానికి గురవుతూ ట్వీట్ చేయగా.. తాజాగా పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా చిన్నప్పటి నిహారికను ఎత్తుకుని ఉన్న ఓ రేర్ ఫొటోను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు.
‘‘మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు. గాడ్ బ్లెస్ యూ’’.. అంటూ చిరు తన ట్వీట్‌తో కాబోయే దంపతులను ఆశీర్వదించారు.
మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు. God bless you! #NisChayWedding @IamNiharikaK pic.twitter.com/eLLPcZcYZV
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2020