Chiranjeevi son in law Kalyan Dhev emotional post on his daughter
Kalyaan Dhev : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ.. కల్యాణ్ దేవ్ (Kalyan Dhev) ని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళైన తరువాత కళ్యాణ్ దేవ్ ని మెగా కుటుంబం నుంచి హీరోగా కూడా పరిచయం చేశారు. అయితే గత కొంత కాలంగా కళ్యాణ్ మెగా కుటుంబంలో కనిపించడం లేదు. వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇటీవల కళ్యాణ్ దేవ్ చేసిన ఒక పోస్ట్ తో వీరిద్దరూ చట్టపరంగా విడిపోయారని అర్ధమవుతుంది.
Tamannaah : చరణ్ అండ్ చైతన్యని వాళ్ళ పేరెంట్స్ చాలా గొప్పగా పెంచారు..
ఇటీవల కళ్యాణ్ దేవ్ తన కూతరు నవిష్కతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. వారంలో నేను ఎంతో ఆనందంగా గడిపేది ఈ నాలుగు గంటలే అంటూ రాసుకొచ్చాడు. సాధారణంగా పిల్లలు ఉన్న భార్యాభర్తలు విడాకులు తీసుకోని విడిపోతే.. న్యాయస్థానం పిల్లల బాధ్యతను ఎవరికి అప్పగించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ పిల్లలు తల్లి దగ్గర ఉంటే.. తండ్రి ఆ పిల్లల్ని వారంలో ఇన్ని గంటలు కలిసే అవకాశం కలిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కల్యాణ్ తన కూతుర్ని కలుస్తునట్లు తెలుస్తుంది.
Chiranjeevi : చిరంజీవి ఆఫర్ ఇస్తే వద్దంటున్న యంగ్ హీరో.. చిరు పక్కన నటించకపోవడమే బెటర్ అంటూ..
తాజాగా కళ్యాణ్ తన సోషల్ మీడియాలో కూతురు గురించి మరో పోస్ట్ వేశాడు. తన తల్లి జ్యోతి పుట్టినరోజు కావడంతో కొన్ని బర్త్ డే కేక్ కటింగ్ ఫోటోలు షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్ డే మామ్. నాకు తెలుసు నీకు నిజమైన వేడుక అంటే అందరం కలిసి ఉండడం. మిస్ యూ బేబీ నవిష్క” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఇటీవల మెగా కపుల్ నిహారిక అండ్ చైతన్య వారి విడాకులను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.