Chiranjeevi : తల్లితో మెగా బ్రదర్స్.. మదర్స్ డే స్పెషల్ పోస్ట్ చేసిన చిరంజీవి..
తాజాగా ఇవాళ మదర్స్ డే సందర్భంగా చిరంజీవి ఓ స్పెషల్ వీడియోని పోస్ట్ చేశారు. ముగ్గురు మెగా బ్రదర్స్ కలిసి తమ తల్లితో కలిసి ఉన్న ఓ వీడియోని షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
- Saketh U
- Published On : May 8, 2022 / 02:52 PM IST
Chiranjeevi
Mothers Day : చిరంజీవి తన తల్లి పట్ల ఎప్పుడూ ప్రేమని చూపిస్తూ ఉంటారు. గతంలో చాలా సార్లు తన తల్లితో ఆనందంగా ఉన్న క్షణాలని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇక మెగా బ్రదర్స్ కూడా పండగలకి, స్పెషల్ డేస్ కి తమ తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకుంటారు. తాజాగా ఇవాళ మదర్స్ డే సందర్భంగా చిరంజీవి ఓ స్పెషల్ వీడియోని పోస్ట్ చేశారు. ముగ్గురు మెగా బ్రదర్స్ కలిసి తమ తల్లితో కలిసి ఉన్న ఓ వీడియోని షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
RGV : నేను మంచి కొడుకుని కాదు.. హ్యాపీ మదర్స్ డే.. ఆర్జీవీ వింత ట్వీట్..
మెగాస్టార్ షేర్ చేసిన ఈ వీడియోలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ షూటింగ్ లొకేషన్లో తమ తల్లి అంజనా దేవితో కలిసి భోజనం చేయడం, ఆ తర్వాత ఆమెని దగ్గరుండి కార్ ఎక్కించడం ఉన్నాయి. ఈ వీడియోకి వకీల్ సాబ్ సినిమా మగువా మగువా సాంగ్ మ్యూజిక్ ని జత చేశారు. చివర్లో వీరు నలుగురు కలిసి దిగిన ఫోటోలు జత చేసి థ్యాంక్ యు అమ్మ అని తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోసారి మెగా బ్రదర్స్ ని ఒకేసారి చూడటంతో అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.
అమ్మలందరికీ అభివందనములు !#HappyMothersDay to All The Mothers of the World! pic.twitter.com/FNiVxdY2QL
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 8, 2022
