RGV : నేను మంచి కొడుకుని కాదు.. హ్యాపీ మదర్స్ డే.. ఆర్జీవీ వింత ట్వీట్..

గతంలో తన తల్లితో దిగిన ఓ ఫోటోని ఆర్జీవీ ట్విట్టర్ లో షేర్ చేసి..'హ్యాపీ మదర్స్ డే అ‍మ్మ. నేను మంచి కొడుకును కాదు కానీ..........

RGV : నేను మంచి కొడుకుని కాదు.. హ్యాపీ మదర్స్ డే.. ఆర్జీవీ వింత ట్వీట్..

Rgv

RGV :  సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఏం చేసినా డిఫరెంట్ గానే ఉంటుంది. తన సినిమాలతో, తన ట్వీట్స్ తో ఎప్పుడూ వివాదాల్లో ఉంటారు ఆర్జీవీ. ఇటీవల డేంజరస్ అంటూ ఓ లెస్బియన్ సినిమా తీసి మరింత వివాదాలు సృష్టించాడు. కాకపోతే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుంది. తాను ఎలాంటి పండగలు చేసుకోనని, ఎవరికి విషెష్ చెప్పానని అంటాడు, అలాగే ఉంటాడు కూడా. తాజాగా ఇవాళ మదర్స్ డే అవ్వడంతో ఓ స్పెషల్ ట్వీట్ చేసాడు ఆర్జీవీ.

Parasuram Petla: మాస్‌లో క్లాస్ పరుశురాం.. ఎస్‌వీపీ మరో మెట్టు ఎక్కిస్తుందా?

గతంలో తన తల్లితో దిగిన ఓ ఫోటోని ఆర్జీవీ ట్విట్టర్ లో షేర్ చేసి..’హ్యాపీ మదర్స్ డే అ‍మ్మ. నేను మంచి కొడుకును కాదు కానీ తల్లిగా నువ్వు చాలా మంచిదానివి’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో ఆర్జీవీ చేతిలో గ్లాస్‌ పట్టుకొని ఉన్నారు. గతంలోనే ఓ సారి ఈ ఫోటో షేర్ చేశారు ఆర్జీవీ. తాజాగా మరోసారి తన తల్లితో ఉన్న ఫోటోని షేర్ చేసి ఇలా విషెస్ చెప్పడంతో ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు మీరు కూడా ఇలాంటి విషెష్ చెప్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.