Site icon 10TV Telugu

Pawan Kalyan Birthday : తమ్ముడి పుట్టిన రోజు.. అదిరిపోయే ఫోటో షేర్ చేసి.. చిరంజీవి స్పెషల్ పోస్ట్..

Chiranjeevi Special Post on Power Star Pawan Kalyan Birthday with Old Photo

Chiranjeevi

Pawan Kalyan Birthday : నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు టేపుతున్నారు. ఫ్యాన్స్ పవన్ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మధ్య ఎంత అనుబంధం ఉందో అందరికి తెలిసిందే.(Pawan Kalyan Birthday)

నేడు తమ్ముడు పుట్టిన రోజున చిరంజీవి అదిరిపోయే పాత ఫోటో షేర్ చేసి.. చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ స్పెషల్ పోస్ట్ చేసారు.

Also Read : OG First Ticket Auction : వామ్మో.. OG ఫస్ట్ టికెట్ వేలం పాట.. ఎన్ని లక్షలు పలికిందో తెలుసా? ఆ డబ్బులన్నీ..

దీంతో మెగాస్టార్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఈ పాత ఫోటోలో చిరు, పవన్ యంగ్ లుక్స్ ఉండటంతో ఈ ఫోటో మరింత వైరల్ గా మారింది.

 

Also See : Pawan Kalyan Rare Photos : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. పవన్ రేర్ ఫొటోలు చూశారా..?

Exit mobile version