Chiranjeevi : నా మనసంతా ‘పెద్ది’ దగ్గరే.. తండ్రిగా మాత్రమే కాదు.. మెగాస్టార్ ట్వీట్ వైరల్..

పెద్ది సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ చూసి చిరు మూవీ టీమ్ అందరికి అభినందనలు తెలియచేస్తూ ట్వీట్ చేసారు. (Chiranjeevi)

  • Updated on- June 4, 2026 / 01:34 PM IST

Chiranjeevi

Chiranjeevi : రామ్ చరణ్ ఎంతగానో కస్టపడి తన బాడీని మూడు ఆటలకు తగ్గట్టు మార్చుకొని కష్టపడి చేసిన పెద్ది సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. పలువురు సెలబ్రిటీలు కూడా పెద్ది సినిమా బాగుందంటూ అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ది సినిమాపై ట్వీట్ వేశారు.

ప్రస్తుతం చిరంజీవి బాబీ దర్శకత్వంలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో ఉన్నారు. ముందు నుంచి చిరుకి పెద్ది సినిమాపై అంచనాలు ఉన్నాయి. కొడుకు కష్టం చూసి చిరంజీవి కూడా ఆశ్చర్యపోయాడు. పెద్ది సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ చూసి చిరు మూవీ టీమ్ అందరికి అభినందనలు తెలియచేస్తూ ట్వీట్ చేసారు.

Also Read : Buchibabu Sana : ‘పెద్ది’లో బుచ్చిబాబు చేసిన పొరపాటు అదే.. సినిమాలో ఆ ఒక్కటి లేకపోయి ఉంటే..

చిరంజీవి తన ట్వీట్ లో.. రామ్ చరణ్, మూవీ టీమ్ అందరికి పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినందుకు అభినందనలు. నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా పెద్ది దగ్గరే ఉంది. గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. పెద్ది పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం. ఇలాంటి అద్భుతమైన కథను రాసి అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబు సానకి నా ప్రత్యేక అభినందనలు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత వెంకట సతీష్ కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు కరునాడ చక్రవర్తి శ్రీ శివరాజ్ కుమార్ గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు జగపతి బాబు గారికి అభినందనలు. అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన ఏ ఆర్ రహమాన్ గారికి, తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన రత్నవేలు గారికి, అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన అవినాష్ కొల్లా గారికి, తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ నవీన్ నూలి గారికి నా ప్రత్యేక అభినందనలు.

ఈ చిత్రం విజయంలో భాగమైన జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు. పెద్ది సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమాకి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.

Also Read : Peddi Collections : ‘పెద్ది’ హవా మొదలు.. అక్కడ బాబాయ్ రికార్డులను లేపేసిన అబ్బాయి.. జస్ట్ ప్రీమియర్స్ తోనే..