Peddi Collections : ‘పెద్ది’ హవా మొదలు.. అక్కడ బాబాయ్ రికార్డులను లేపేసిన అబ్బాయి.. జస్ట్ ప్రీమియర్స్ తోనే..
ఇప్పటికే ప్రీమియర్స్ తోనే భారీ ఓపెనింగ్స్ సాధిస్తుంది పెద్ది సినిమా. (Peddi Collections)
Peddi Collections
Peddi Collections : ఎన్నో రోజులుగా ఎదురుచూసిన రామ్ చరణ్ పెద్ది సినిమా నేడు జూన్ 4న థియేటర్స్ లో రిలీజ్ అయింది. నిన్న రాత్రి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది ఈ సినిమా. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ఇక కలెక్షన్స్ లో కూడా అప్పుడే హవా మొదలుపెట్టేసింది పెద్ది సినిమా.
ఇప్పటికే ప్రీమియర్స్ తోనే భారీ ఓపెనింగ్స్ సాధిస్తుంది పెద్ది సినిమా. ఇక పాత రికార్డులను కూడా బద్దలుకొడుతుంది పెద్ది. కర్ణాటకలో కూడా తెలుగు స్టార్ హీరోల సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కర్ణాటకలో పవన్ కళ్యాణ్ OG సినిమా ప్రీమియర్స్ రికార్డుని రామ్ చరణ్ పెద్దితో బ్రేక్ చేసాడు.
Also Read : Bandla Ganesh : అసలు నువ్వెవడివి? నీ బతుక్కి.. ప్రకాష్ రాజ్ కి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్..
కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ఓజి సినిమా ప్రీమియర్స్ తోనే దాదాపు 2.7 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. పెద్ది సినిమా ప్రీమియర్స్ తో ఏకంగా 3.2 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. దీంతో పవన్ OG ప్రీమియర్ రికార్డులను పెద్ది సినిమా కర్ణాటకలో బద్దలు కొట్టింది. ఇక కర్ణాటకలో OG సినిమా ఫుల్ రన్ లో దాదాపు 19 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి చరణ్ పెద్ది సినిమా ఈ కలెక్షన్స్ మించి సాధించి బాబాయ్ రికార్డుని బద్దలుకొడుతుందా లేదా చూడాలి.
