Bandla Ganesh : అసలు నువ్వెవడివి? నీ బతుక్కి.. ప్రకాష్ రాజ్ కి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్..
ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణ ఇష్యూ జరిగిన సంగతి తెలిసిందే. (Bandla Ganesh)
Bandla Ganesh
Bandla Ganesh : ప్రకాష్ రాజ్ ఇటీవల పవన్ కళ్యాణ్ పై రెగ్యులర్ గా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అసలు సంబంధం లేని విషయాల్లో కూడా ప్రకాష్ రాజ్ పవన్ పై కామెంట్స్ చేస్తూ వైరల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు, నెటిజన్లు ప్రకాష్ రాజ్ ని ఎంత విమర్శించినా ఆయన మాత్రం ట్వీట్స్ వేస్తూనే ఉన్నాడు.
ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణ ఇష్యూ జరిగిన సంగతి తెలిసిందే. భారదేశంలో ఎవరు ఎక్కడినుంచైనా పోటీ చేయొచ్చు అనే హక్కు ఉందంటూ పవన్ తెలంగాణాలో కూడా జనసేన పోటీ చేస్తుందని అన్నారు. దీనిపై ప్రకాష్ రాజ్.. మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి అంటూ ట్వీట్ వేసాడు. దీనిపై ఇప్పటికే విమర్శలు వస్తుండగా బండ్లగణేష్ ఈ ట్వీట్ కి ఘాటు రిప్లై ఇచ్చాడు.
Also Read : Peddi OTT : ‘పెద్ది’ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుంది..?
బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో.. తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్ అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో బండ్లన్న ట్వీట్ వైరల్ గా మారింది.
నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని… https://t.co/ELkBZtEUh8
— BANDLA GANESH. (@ganeshbandla) June 4, 2026
