Chiranjeevi To Do Guest Role In Allu Arjun And Atlee Kumar Movie
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌గా చెబుతున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. కేవలం అనౌన్స్‌మెంట్ వీడియోతోనే సినిమాపై అంచనాలు పీక్ లెవల్‌కు చేరాయి. ఇందులో అల్లుఅర్జున్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నట్లు టాక్. అయితే ఈ చిత్రంలో దాదాపు ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారని ఇప్పటికే బజ్ నడుస్తోంది.
అల్లుఅర్జున్ 22వ మూవీపై ఇప్పుడు లేటెస్ట్ గాసిప్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. సినిమాలో ప్రీ-క్లైమాక్స్‌లో ఊహించని మెగా ట్విస్ట్ ఉందట. మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీలో దాదాపు ఐదు నిమిషాల పాటు స్క్రీన్‌పై మెరవనున్నారట. చిరు క్యామియో సినిమాకు బిగ్ హైలైట్‌గా నిలువనుందంటున్నారు.
Balakrishna : బాలయ్య మ్యాన్షన్ హౌజ్ యాడ్ చూశారా..? సింహం మీద సవారి.. అదిరిందిగా..
అట్లీ-బన్నీ కలిసి చిరుని ఈ ప్రత్యేక పాత్ర కోసం ఒప్పించారని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ గాసిప్ నిజమైతే, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. చిరు ఎంట్రీతో సినిమా రేంజ్ మరో లెవెల్‌కి వెళ్లిపోతుందని, ఇది ఆడియన్స్‌కి బిగ్ సర్‌ప్రైజ్ అవుతుందని జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సేమ్‌టైమ్ మెగా, అల్లు ఆర్మీ అంటూ జరుగుతోన్న సోషల్ మీడియా వార్‌కు తెరపడే అవకాశం ఉంది. అల్లుఅర్జున్ మూవీలో చిరు రోల్ ఉంటుందా లేదా అనేది చూడాలి మరి.