Balakrishna : బాలయ్య మ్యాన్షన్ హౌజ్ యాడ్ చూశారా..? సింహం మీద సవారి.. అదిరిందిగా..

బాలయ్య సింహం మీద సవారీ చేస్తూ వచ్చిన మ్యాన్షన్ హౌజ్ యాడ్ వైరల్ గా మారింది.

Balakrishna : బాలయ్య మ్యాన్షన్ హౌజ్ యాడ్ చూశారా..? సింహం మీద సవారి.. అదిరిందిగా..

Balakrishna Mansion House Drinking Water Ad goes Viral

Updated On : May 30, 2025 / 9:09 PM IST

Balakrishna : బాలకృష్ణ వల్ల మ్యాన్షన్ హౌజ్ అనే ఆల్కహాల్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్య మ్యాన్షన్ హౌజ్ తాగుతారని అంటారు. బాలయ్య కూడా డైరెక్ట్ గానే దాని గురించి మాట్లాడతారు. బాలయ్య వల్ల మ్యాన్షన్ హౌజ్ ఎంత వైరల్ అయిందంటే ఆహాలో బాలయ్య హోస్ట్ చేసే అన్‌స్టాపబుల్ షోకి మ్యాన్షన్ హౌజ్ వచ్చి స్పాన్సర్ చేసే రేంజ్ లో వైరల్ అయింది.

హీరోలంతా యాడ్స్ చేస్తారని తెలిసిందే. బాలయ్య కూడా ఇటీవలే యాడ్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే కొన్ని యాడ్స్ చేయగా తాజాగా మ్యాన్షన్ హౌజ్ కి యాడ్ చేసారు. మ్యాన్షన్ హౌజ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ కి యాడ్ చేసారు బాలయ్య. తాజాగా ఆ యాడ్ ని రిలీజ్ చేయడంతో అది వైరల్ గా మారింది.

Also Read : Allu Arjun : రెండు అవార్డులతో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన అల్లు అర్జున్.. ఇక ఈ ఛాన్స్ ఎవరికీ రాదేమో..

బాలకృష్ణ మ్యాన్షన్ హౌజ్ యాడ్ లో బాలయ్య సింహం మీద సవారీ చేసుకుంటూ రావడం కొత్తగా ఉంది. బాలయ్యని సింహంతో పోలుస్తూ మాట్లాడతారని తెలిసిందే. దానికి తగ్గట్టే సింహం, బాలయ్యని పక్కపక్కన పెట్టి యాడ్ చేసారు. ఇందులో ఓ షూటర్ వచ్చి సింహంని కాలుద్దాం అనుకుంటే అంతలో బాలయ్య సింహం మీద సవారీ చేస్తూ వచ్చి ‘అన్నిటిని లవ్ చెయ్ లయన్ హార్ట్ తో వెల్కమ్ చెయ్.. జిందగీలో ఏదైనా దిల్ ఓపెన్ చెయ్ లైఫ్ వెల్కమ్ చెయ్..’ అంటూ బాలయ్య డైలాగ్ చెప్పి అలరించారు.

బాలయ్య సింహం మీద సవారీ చేస్తూ వచ్చిన మ్యాన్షన్ హౌజ్ యాడ్ వైరల్ గా మారింది. మీరు కూడా చూసేయండి ఆ యాడ్..

Also Read : Nagababu – Niharika : అపుడు తండ్రి.. ఇప్పుడు కూతురు.. అదే కేటగిరిలో నిర్మాతగా మొదటిసారి అవార్డులు..