Nagababu – Niharika : అప్పుడు తండ్రి.. ఇప్పుడు కూతురు.. అదే కేటగిరిలో నిర్మాతగా మొదటిసారి అవార్డులు..
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Nagababu and Niharika Konidela gets Awards in Same Category after turned as First Time Producers
Nagababu – Niharika : ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 లో రిలీజయిన సినిమాలకు గాను వివిధ విభాగాల్లో గద్దర్ అవార్డులు ప్రకటించారు. వీటిలో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కమిటీ కుర్రోళ్ళు సినిమాకు వచ్చింది. ఈ సినిమాని మెగా డాటర్ నిహారిక నిర్మించింది.
ఈ సినిమా నిహారికకు నిర్మాతగా మొదటి సినిమా కావడం గమనార్హం. అలాగే ఈ సినిమా డైరెక్టర్ కి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు కూడా వరించింది. నిహారిక మొదటిసారిగా నిర్మాతగా మారి తీసిన కమిటీ కుర్రోళ్ళు సినిమా జాతీయ సమైక్యతపై ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అందుకోవడంతో నిహారిక, మూవీ యూనిట్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.
Also See : Nivetha Thomas : ఉత్తమ నటి గద్దర్ అవార్డు గెలిచిన నివేదా థామస్.. ఫ్యామిలీతో సెలబ్రేషన్స్.. ఫొటోలు..
అయితే గతంలో నాగబాబు కూడా ఇదే కేటగిరిలో అవార్డు అందుకున్నారు. నాగబాబు నిర్మాతగా మారి తెరకేకించిన మొదటి సినిమా చిరంజీవి రుద్రవీణ. ఈ సినిమా జాతీయ సమైక్యతపై ఉత్తమ చలన చిత్రంగా నేషనల్ అవార్డు అందుకుంది. 1988 లో రిలీజయిన ఈ సినిమా నేషనల్ అవార్డు అందుకోవడమే కాక స్పెషల్ జ్యురిలో నంది అవార్డు కూడా అందుకుంది.
అలా నాగబాబు మొదటిసారి నిర్మాతగా తీసిన సినిమాకు జాతీయ సమైక్యత నేషనల్ అవార్డు రావడం, ఇప్పుడు నిహారిక మొదటిసారి నిర్మాతగా మారి తీసిన సినిమాకు జాతీయ సమైక్యత గద్దర్ అవార్డు రావడం యాదృచ్ఛికమైనా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ విషయాన్ని నాగబాబు తన సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ సంతోషం వ్యక్తం చేసారు. తండ్రి కూతుళ్లు ఇద్దరూ మొదటిసారి నిర్మాతగా మారి తీసిన సినిమాలకు ఒకే కేటగిరిలో అవార్డులు రావడం ఆశ్చర్యకర విషయమే.
View this post on Instagram
Also Read : Manchu Lakshmi : బాలీవుడ్ షోలో మంచు లక్ష్మి.. ‘ది ట్రైటర్స్’ ట్రైలర్ రిలీజ్.. బిగ్ బాస్ కి కాపీలా ఉందే..