Allu Arjun : రెండు అవార్డులతో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన అల్లు అర్జున్.. ఇక ఈ ఛాన్స్ ఎవరికీ రాదేమో..
పుష్ప సినిమా నుంచి అల్లు అర్జున్ జాతకమే మారిపోయింది.

Allu Arjun is the One and Only Actor getting National and Gaddar Best Actor Awards first Time
Allu Arjun : పుష్ప సినిమా నుంచి అల్లు అర్జున్ జాతకమే మారిపోయింది. టాలీవుడ్ లెవల్ నుంచి నేషనల్ లెవల్ కి వెళ్లిపోయి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప 2 సినిమాతో ఏకంగా 1870 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి రికార్డులను సైతం బద్దలుకొట్టాడు. ఇదంతా ఒక ఎత్తైతే నేషనల్ బెస్ట్ యాక్టర్ గా పుష్ప సినిమాకు అవార్డు అందుకొని నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోగా నిలిచాడు. నేషనల్ అవార్డుతోనే మొదటి హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు.
దానికి తోడు మరో అవార్డు ఇప్పుడు జతచేరింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా ఇస్తున్న గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 సంవత్సరానికి గాను బెస్ట్ యాక్టర్ గా పుష్ప 2 సినిమాకు మొదటి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు సాధించాడు. బెస్ట్ యాక్టర్ గా తెలంగాణ స్టేట్ అవార్డు అందుకున్న మొదటి హీరోగా మరో రికార్డ్ సెట్ చేసాడు.
Also Read : Nagababu – Niharika : అపుడు తండ్రి.. ఇప్పుడు కూతురు.. అదే కేటగిరిలో నిర్మాతగా మొదటిసారి అవార్డులు..
ఇలా మొదటి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరోగా, అలాగే బెస్ట్ యాక్టర్ గా మొదటి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు. ఈ రికార్డ్ బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో. భవిష్యత్తులో నేషనల్ అవార్డు, గద్దర్ అవార్డు వేరే హీరోలు అందుకోవచ్చు ఏమో గాని మొదటిసారి అనే రికార్డ్ మాత్రం అల్లు అర్జున్ పేరుమీదే. ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Nivetha Thomas : ఉత్తమ నటి గద్దర్ అవార్డు గెలిచిన నివేదా థామస్.. ఫ్యామిలీతో సెలబ్రేషన్స్.. ఫొటోలు..