Chiranjeevi : నెట్‌ఫ్లిక్స్‌లో చిరు టాక్ షో..!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అరంగేట్రంతో మరో ఆసక్తికరమైన ప్రయాణానికి సిద్ధమవుతున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- October 31, 2026 / 01:14 PM IST
Chiranjeevi to Host OTT Talk Show MEGAVERSE on Netflix
Chiranjeevi : దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అరంగేట్రంతో మరో ఆసక్తికరమైన ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. మెగావర్స్ టాక్ షో పేరుతో డిజిటర్ ప్లాట్‌ఫామ్‌పై ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.
బాలీవుడ్లో స్టార్ హీరో, హీరోయిన్లతో సెలబ్రిటీలతో ముచ్చట్లు.. సరదా సంభాషణలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాఫీ విత్ కరణ్ షో ఎంత పాపులరో తెలిసిందే. అదే తరహాలో టాలీవుడ్ స్టార్లతో సందడి చేసేందుకు మెగావర్స్ పేరుతో టాక్‌షోకు సిద్ధమవుతుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి.
చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ షోలో సినీ ప్రముఖులతో ఎలాంటి సంభాషణలు ఉంటాయి.? స్టార్ హీరోల నుంచి ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తాయి.? అన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే బ్రహ్మానందం, సునీల్, సత్య వంటి నటులతో పాటు కమల్ హాసన్ ఎపిసోడ్ గురించి ప్రచారం జరుగుతుండగా..భవిష్యత్‌లో పవన్ కల్యాణ్, రామ్ చరణ్ వంటి ప్రముఖులు కూడా ఈ వేదికపై కనిపిస్తారనే చర్చ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Deviyani Sharma : ఆదర్శ కుటుంబం వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన దేవియాని శర్మ
కాఫీ విత్ కరణ్ షోకు మించి..చిరు మెగావర్స్ ప్లాన్ చేస్తున్నారా.? అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. కాఫీ విత్ కరణ్ షోకు ఉన్న ఆదరణ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతకు మించి క్రేజ్‌ను సంపాదించాలంటే..కేవలం స్టార్ హీరోలను గెస్టులుగా తీసుకురావాలి. అంతేఊకాదు వారి వ్యక్తిత్వాలు, కెరీర్‌లోని కీలక మలుపులు, తెరవెనుక అనుభవాలు, సరదా సంఘటనలు, ప్రేక్షకులకు తెలియని ఆసక్తికరమైన, సహజమైన సంభాషణలతో ఆవిష్కరించాలి.
చిరంజీవి తనదైన శైలి, హాస్యం, అనుభవంతో ఈ షోను మరో స్థాయికి తీసుకెళ్తారా.? మెగా ఫ్యామిలీ హీరోలను షోకు తీసుకొస్తారా.? మెగావర్స్ షో..కాఫీ విత్ కరణ్‌ను బీట్ చేస్తుందా.? అనేది షోలోని కంటెంట్, అతిథుల ఎంపిక, ప్రేక్షకుల ఆదరణపై ఆధారపడి ఉంటుంది. మెగాస్టార్ హోస్టింగ్‌లో మెగావర్స్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
