Konijeti Rosaiah : నన్ను రాజకీయాల్లోకి రమ్మన్నారు.. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపై చిరంజీవి సంతాపం

రోశయ్య మరణంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తన ప్రగాఢ సంతాపం.....

Konijeti Rosaiah :  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి కొణిజేటి రోశయ్య కొద్దీ సేపటి క్రితం మరణించారు. రాజకీయాల్లో ఆయన అపర చాణక్యుడు. ఆర్ధిక శాఖా మంత్రిగా 15 సార్లు పని చేసి ఆంద్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టిన గొప్ప వ్యక్తి. పార్టీలు మారకుండా ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న మహా నాయకుడు రోశయ్య. అనేక శాఖల మంత్రిగానే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా కూడా ఎంతో సేవ చేశారు. ఇవాళ ఉదయం ఆయన గుండెపోటుతో మరణించడం బాధాకరం. అయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.

Rahul sipligunj : వార్ వన్‌ సైడ్.. సన్నీకి సపోర్ట్ చేస్తున్న రాహుల్

రోశయ్య మరణంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తన ప్రగాఢ సంతాపం తెలియచేశారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత అని, రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఓ రుషిలాగా సేవ చేశారని, రోశయ్య కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసిందని పోస్ట్ చేశారు.

Kareena Kapoor : నైటీతో బయటకి వచ్చిందంటూ కరీనాను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

అంతే కాక రోశయ్య నన్ను రాజకీయాల్లోకి రమ్మని మనస్ఫూర్తిగా ఆహ్వానించారని, వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజమన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య అని ఆయనతో తనకున్న అనుబంధాన్ని తెలియచేశారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

ట్రెండింగ్ వార్తలు