Rahul sipligunj : వార్ వన్ సైడ్.. సన్నీకి సపోర్ట్ చేస్తున్న రాహుల్
తాజాగా బిగ్ బాస్ మాజీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఓ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. గతంలో షో చూసి ఎంజాయ్ చేస్తున్నాను, కానీ నేను ఎవరికి సపోర్ట్ చేయను అని....
Rahul sipligunj : బిగ్ బాస్ షో ముగింపు దశకు వచ్చేసింది. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ పూర్తవుతుంది. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా కష్టపడి ఆడుతున్నారు. అంతే కాక బయట వీళ్ళ కోసం ప్రమోషన్స్ చేయిస్తున్నారు. సోషల్ మీడియాలో కంటెస్టెంస్ట్ ఫ్యాన్ పేజెస్ తో పాటు సెలబ్రిటీలతో కూడా వీళ్ళకి సపోర్ట్ చేయమని ప్రమోషన్స్ చేయిస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు తమంత తాముగా హౌస్ లోని కంటెస్టెంట్ లకు సపోర్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ చివరి స్టేజికి రావడంతో సెలబ్రిటీల ప్రమోషన్స్ ఎక్కువైపోయాయి.
Kareena Kapoor : నైటీతో బయటకి వచ్చిందంటూ కరీనాను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
తాజాగా బిగ్ బాస్ మాజీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఓ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. గతంలో షో చూసి ఎంజాయ్ చేస్తున్నాను, కానీ నేను ఎవరికి సపోర్ట్ చేయను అని రాహుల్ అన్నాడు. ఇప్పుడు ఈ బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మాట మార్చాడు. తాజాగా సన్నీకి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రమోషన్ చేస్తున్నాడు. సన్నీ గేమ్‌కు ఫిదా అయ్యానని, హౌస్ లో వార్ వన్‌సైడ్ అయిందంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ కొద్దీ సేపటికి సగటు ప్రేక్షకుడిగా నా అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాను. నన్ను ఫాలో అయ్యేవారిలో ఏ ఒక్కరిని కూడా నేను ఇన్ఫ్లూయెన్స్ చేయడం లేదు. మీకు నచ్చిన కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తాను అని చెప్పాడు.
Bigg Boss 5 : నీ సొంత వైద్యం ప్రయత్నించకు.. ప్రియాంకకి షాక్ ఇచ్చిన బిగ్‌బాస్
దీంతో కొంతమంది కంటెస్టెంట్స్ అభిమానులు మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీ ఫాన్స్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అలా ఓపెన్ గా ఉండకుండా మళ్ళీ మీ ఇష్టం అంటూ ఎందుకు అని రాహుల్ ని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ మాత్రం హౌస్ లో వార్ వన్ సైడ్ అయిపోయినట్టు, సన్నీ గెలుస్తున్నట్టు ఫిక్స్ అయ్యాడు. మరి ఎవరు విన్ అవుతారో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.