Mana Shankara Varaprasad Garu
Mana Shankara Varaprasad Garu : అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేస్తుంది. ప్రీమియర్స్ నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని భారీ విజయం వైపు దూసుకుపోతుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా వెంకటేష్ గెస్ట్ రోల్ చేసి అలరించాడు. ఫ్యామిలీస్ కి ఈ సినిమా తెగ నచ్చేసింది. సింగిల్ స్క్రీన్స్ అన్ని ఫుల్ అయిపోతున్నాయి.(Mana Shankara Varaprasad Garu)
మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఆమోదటి రోజు ఏకంగా 84 కోట్ల గ్రాస్ వసూలు చేసి చిరు కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. తాజాగా మూడు రోజుల కలెక్షన్స్ ని మూవీ యూనిట్ ప్రకటించారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా మూడు రోజుల్లో 152 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Also Read : Ananya Nagalla : సంక్రాంతి స్పెషల్.. ట్రెడిషినల్ లుక్ లో అనన్య నాగళ్ళ అదరగొట్టిందిగా..
ఈ సినిమాకు 120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. హిట్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 240 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. సంక్రాంతి పండగ హాలిడేస్ ఇంకా ఉండటం, సినిమా హిట్ టాక్ రావడంతో ఈజీగా ఈ కలెక్షన్స్ వచ్చేస్తాయని అంచనా వేస్తున్నారు.