Chiranjeevi Visits BRS leader KCR At Yashoda Hospital
Chiranjeevi : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత ‘కేసీఆర్’ ఇటీవల తన నివాసంలో ప్రమాదానికి గురై హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో శుక్రవారం(డిసెంబర్ 8, 2023)న కేసీఆర్ కు శస్త్రచికిత్స జరిగింది. ఆయన కోలుకునే అంతవరకూ వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స ఇవ్వనున్నారు. ఇక హాస్పిటల్ చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
ఈక్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కేసీఆర్ ని పరామర్శించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కేసీఆర్ ని పరామర్శించారు. కేసీఆర్ ని పలకరించిన చిరంజీవి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ.. “ఆయన చాలా హుషారుగా ఉన్నారు. త్వరగా కోలుకుంటున్నారు. ఆపరేషన్ జరిగిన 24 గంటలోనే కేసీఆర్ గారిని నడిచేలా చేశారంటే డాక్టర్స్ ని అభినందించాలి. అలాగే కేసీఆర్ గారు సినిమా పరిశ్రమ గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. సినిమాలు ఎలా ఆడుతున్నాయి అని అడిగి తెలుసుకున్నారు” అంటూ చిరంజీవి తెలియజేశారు.
Also read : Kannappa : ‘కన్నప్ప’ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మోహన్ లాల్.. గాయంతో మళ్ళీ షూటింగ్‌కి బ్రేక్..