Khushbu Sundar : కేంద్ర ప్రభుత్వంలో నటి ఖుష్బూకి పదవి.. చిరు అభినందనలు!

సినీ నటి మరియు రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కి కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. మోడీ ప్రభుత్వం ఖుష్బూని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూని నామినేట్ చేశారు. ఇక ఆమెకు ఈ పదవి దక్కడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే..

Khushbu Sundar : సినీ నటి మరియు రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కి కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. 2010లో డీఎంకేలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఖుష్బూ.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో, ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతుంది. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ మహిళా కమిషన్ నామినేషన్స్ ప్రకటించింది. ఈ క్రమంలోనే మోడీ ప్రభుత్వం ఖుష్బూని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూని నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ఖుష్బూ తెలియజేస్తూ ఫిబ్రవరి 27న ట్విట్టర్ లో పోస్ట్ వేసింది.

Khushbu Sundar: జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూ నామినేట్

ఇంత గొప్ప బాధ్యతను తాను నిర్వర్తించగలనని తనపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేసింది. ఇక ఆమెకు ఈ పదవి దక్కడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నమలై.. ఎన్సీడబ్ల్యూ సభ్యురాలిగా ఖష్బూను నామినేట్ చేయడం ఆమె మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న తీరుకు గుర్తింపు అని అన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఖుష్బూకి అభినందనలు తెలిపాడు.

”ఈ పదవికి నువ్వు ఖచ్చితంగా అర్హురాలివి. మహిళలకు సంబంధించిన అన్ని సంబంధిత సమస్యలపై ఎక్కువ దృష్టిని పెట్టి, మరింత సమర్థవంతమైన పరిష్కారాన్ని చూపిస్తూ.. మహిళలకు శక్తివంత వాయిస్‌గా నువ్వు మారాలి అని నేను ఆశిస్తున్నా. ఈ పదవి నీకు దక్కినందుకు నా శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశాడు. కాగా, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూతో పాటు మమతా కుమారి, డెలీనా ఖోంగ్ డప్ ను కూడా నామినేట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు