Chiranjeevi : చిరంజీవిని పట్టుకున్న నటుడు.. చెయ్యి తీసేయమన్న అసిస్టెంట్.. పర్లేదు వేసుకో అని చిరు.. వీడియో వైరల్..

కమిటీ కుర్రాళ్ళు మూవీ టీం అందర్నీ చిరంజీవి పిలిచి అభినందించారు. దీంతో అక్కడికి వచ్చిన మూవీ టీమ్ అంతా మెగాస్టార్ తో ఫోటోలు దిగారు.

Chiranjeevi with Actor Yashwanth Video Goes Viral Fans Praises Megastar

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యాన్స్ తో, తన దగ్గరికి కలవడానికి వచ్చిన వాళ్ళతో ఎంతో ఒద్దికగా ఉంది వారితో మాట్లాడి, వారికి ఫోటోలు ఇచ్చి పంపిస్తారు. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన వైరల్ గా మారింది. ఇటీవల నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా రిలీజయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మెగాస్టార్ కూడా చూసి నచ్చడంతో మెచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో కమిటీ కుర్రాళ్ళు మూవీ టీం అందర్నీ చిరంజీవి పిలిచి అభినందించారు. దీంతో అక్కడికి వచ్చిన మూవీ టీమ్ అంతా మెగాస్టార్ తో ఫోటోలు దిగారు. అందులో చాలా మంది నటులకు ఈ సినిమాతోనే గుర్తింపు రావడం, చాలా మందికి చిరంజీవి ఫేవరేట్ హీరో అవ్వడంతో ఎమోషనల్ అయ్యారు.

Also Read : Kavya Thapar : ఆశ్రమంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న డబల్ ఇస్మార్ట్ హీరోయిన్..

ఈ క్రమంలో నటుడు యశ్వంత్ చిరంజీవి కోసం తెచ్చిన గిఫ్ట్స్ ని ఇచ్చి చిరంజీవి కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం చిరంజీవితో ఫోటో దిగడానికి యశ్వంత్ రాగా చిరు యశ్వంత్ పై చెయ్యి వేయగా యశ్వంత్ కూడా చిరంజీవి వెనుక నుంచి చెయ్యి వేసాడు. వెంటనే పక్కనే ఉన్న ఓ చిరంజీవి అసిస్టెంట్ యశ్వంత్ చెయ్యి తీసేసాడు. చిరంజీవి వెంటనే స్పందించి వాళ్ళు అలాగే అంటారు నువ్వు వేసుకో అన్నారు. యశ్వంత్ పర్లేదు అంటున్నా చిరంజీవే యశ్వంత్ చెయ్యి తీసుకొని తన వెనుక వేసుకున్నారు. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా ఎంతైనా మెగాస్టార్ బంగారం అని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి మెగాస్టార్ మంచితనాన్ని మెచ్చుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు