Kavya Thapar : ఆశ్రమంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న డబల్ ఇస్మార్ట్ హీరోయిన్..

తన పుట్టిన రోజు కావడంతో కావ్య థాపర్ ఉత్తరాఖండ్ హరిద్వార్ దగ్గర్లో ఉన్న అనంత్ ధామ్ ఆశ్రమంలో తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది.

Kavya Thapar : ఆశ్రమంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న డబల్ ఇస్మార్ట్ హీరోయిన్..

Actress Kavya Thapar Celebrated her Birthday at Anant Dham Ashram

Updated On : August 21, 2024 / 6:50 AM IST

Kavya Thapar : మన సెలబ్రిటీలు పలువురు వారి పుట్టిన రోజు వేడుకలను, స్పెషల్ డేస్ ని ఆశ్రమాల్లో ఆనాధలు, వృద్ధుల మధ్య జరుపుకుంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా అనంత్ ధామ్ ఆశ్రమంలో తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. ఇటీవలే డబల్ ఇస్మార్ట్ సినిమాతో బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య థాపర్ అలరించింది. నిన్న ఆగస్టు 20న కావ్య థాపర్ పుట్టిన రోజు.

నిన్న తన పుట్టిన రోజు కావడంతో కావ్య థాపర్ ఉత్తరాఖండ్ హరిద్వార్ దగ్గర్లో ఉన్న అనంత్ ధామ్ ఆశ్రమంలో తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. అక్కడ గురువు అనంత్ బాబా ఆశీస్సులు తీసుకుంది. అక్కడ ఉన్న అనాధలకు, ఆ ఆశ్రమంలో ఉండేవారికి భోజనం ఏర్పాటు చేసింది. ఆశ్రమంలో తన పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read : మెగా ఫ్యామిలీకి మిస్టర్ బచ్చన్ టెన్షన్? నిజమేనా?

కావ్య థాపర్ తన పుట్టిన రోజు వేడుకల ఫోటోలు, వీడియోలు షేర్ చేసి.. నా ఇల్లు, నా ఆశ్రమం, నా గురువు వద్ద పుట్టిన రోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకోడానికి సంతోషిస్తున్నాను. నా జీవితంలో ఒక గుర్తుండిపోయే రోజు ఇచ్చినందుకు అనంత్ ధామ్ ఆశ్రమానికి ధన్యవాదాలు. మీ అడుగుజాడల్లో నడిచి మీ ప్రేమ, ఆశీర్వాదాలు కంటే ఈ జీవితానికి ఇంకా ఏమి అడగలేదు. నా పుట్టిన రోజు నాడు నాకు శుభాకాంక్షలు చెప్పిన నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్.. అందరికి ధన్యవాదాలు. మీ వల్లే నేను ఇక్కడ ఉన్నాను అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. దీంతో కావ్య థాపర్ బర్త్ డే ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

View this post on Instagram

A post shared by Kavya Thapar (@kavyathapar20)

ప్రస్తుతం కావ్య థాపర్ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోజులతో ఫోటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.