×
Ad

Chiyaan Vikram: ఆరేళ్ళ షూటింగ్.. తొమ్మిదేళ్ల వెయిటింగ్.. విడుదలకు సిద్దమైన విక్రమ్ మూవీ

తొమ్మిదేళ్ల సుదీర్ఘ ఎదురుచూపుల తరువాత విడుదల కాబోతున్న చియాన్ విక్రమ్(Chiyaan Vikram) కొత్త సినిమా.

Chiyaan Vikram Dhruva Natchathiram movie releasing in February.

  • విక్రమ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
  • రిలీజ్ కి రెడీ అయిన ‘ధృవ నచ్చతిరం’
  • ఫిబ్రవరిలోనే ముహూర్తం

Chiyaan Vikram: ఒక సినిమా విడుదల ఆగిపోవడానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. కానీ, ఆ తరువాత నెలకో.. రెండు నెలలకో విడుదల అవుతుంది. కానీ, ఒక సినిమా మాత్రం దాదాపు 9 ఏళ్ళ నుంచి విడుదల అవకుండా ఆగిపోతూ వస్తోంది. దాదాపు ఈ సినిమాను ఆడియన్స్ కూడా ఎప్పుడో మర్చిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే తమిళ స్టార్ విక్రమ్(Chiyaan Vikram) హీరోగా చేసిన ‘ధృవ నచ్చతిరం’.

తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అసలు ఈ సినిమాను ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ, షూటింగ్ లేట్ గానే జరిగింది. విడుదల కూడా అలానే సాగుతోంది. యాక్షన్ బ్యాక్డ్రాళ్ లో వచ్చిన ఈ సినిమాకు సంబందించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా ఇప్పటికే విడుదల అయ్యాయి. మధ్యలో 2023లోనే ఈ సినిమాను విడుదల అవుతుంది అంటూ కూడా మేకర్స్ ప్రకటించారు.

Dhandoraa OTT: ఓటీటీలోకి కొత్త సినిమా దండోరా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఏమైయ్యిందో తెలియదు కానీ, మళ్ళీ వాయిదా పడింది. ఇక అప్పటినుంచి మళ్ళీ ఈ సినిమా విడుదలపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంతకాలానికి మరోసారి ధృవ నచ్చతిరం సినిమా విడుదల గురించి చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ధృవ నచ్చతిరం సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈమేరకు త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది అంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఈ న్యూస్ తెలియడంతో విక్రమ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, చాలా కాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్నాడు హీరో విక్రమ్. అందుకే ‘ధృవ నచ్చతిరం’ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. కానీ, ఆ సినిమా మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. మరి ఇప్పటికైనా ఈ సినిమా విడుదల అవుతుందా? లేదా మళ్ళీ వాయిదా పడుతుందా అనేది చూడాలి. ఇక ప్రస్తతం విక్రమ్ తన కెరీర్ లో 63వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రాజ్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.