Thangalaan : టీజర్, మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన విక్రమ్..

తమిళ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న 'తంగలాన్' సినిమా రిలీజ్ డేట్ ని, టీజర్ రిలీజ్ డేట్ ని ఒకేసారి అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు మేకర్స్.

Chiyaan Vikram Thangalaan movie and teaser release date announced

Thangalaan : తమిళ్ స్టార్ హీరో విక్రమ్, పా రంజిత్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘తంగలాన్’. ఆ మధ్య ఈ మూవీ మేకింగ్ వీడియో ని రిలీజ్ చేసి ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేశారు. ఈ మూవీలో విక్రమ్ లుక్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. గతంలో చాలా సినిమాల్లో విక్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి ఆడియన్స్ ని థ్రిల్ ఫిల్ చేశాడు. ఈ సినిమాలో ఒక అడివి మనిషిలా బీస్ట్ గా కనిపిస్తున్నాడు. విక్రమ్ అని గుర్తు పెట్టడానికే కొంత సమయం పడుతుంది. అంతలా విక్రమ్ తన బాడీని పాత్రకు తగ్గట్టు మార్చుకున్నాడు.

కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా కొన్ని వందల ఏళ్ళ క్రితం జరిగిన ఒక కథని తీసుకోని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇక ఈ మూవీలోని విక్రమ్ లుక్స్ చూసి సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఆడియన్స్ అంతా ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ డేట్ ని, టీజర్ రిలీజ్ డేట్ ని ఒకేసారి అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే నాడు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Also read : Varun – Lavanya : ఏడడుగులు వేయడానికి ఇటలీ బయలుదేరిన వరుణ్, లావణ్య..

పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక టీజర్ ని నవంబర్ 1న ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులకు సినిమా పై మరింత అంచనాలు క్రియేట్ చేస్తుంది. తెలుగులో ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ లో కనిపించబోతున్నారు. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.