‘కోబ్రా’ – విక్రమ్ లుక్స్ అదిరిపోయాయిగా!..

తమిళ స్టార్ హీరో ‘చియాన్’ విక్రమ్ ‘కోబ్రా’ ఫస్ట్ లుక్ వైరల్..

  • Published By: sekhar ,Published On : February 28, 2020 / 03:20 PM IST
‘కోబ్రా’ – విక్రమ్ లుక్స్ అదిరిపోయాయిగా!..

Updated On : February 28, 2020 / 3:20 PM IST

తమిళ స్టార్ హీరో ‘చియాన్’ విక్రమ్ ‘కోబ్రా’ ఫస్ట్ లుక్ వైరల్..

‘చియాన్’ విక్రమ్.. తమిళస్టార్ హీరో.. ఎంత కష్టమైనా సరే.. సినిమా కోసం పోషించే పాత్ర కోసం హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తనని మలుచుకుంటుంటాడు. ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘ఇంకొక్కడు’ ఇలా తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశాడు.

విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’.. ‘The King Cobra has Arrived’ అంటూ తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఏడు డిఫరెంట్ గెటప్స్‌లో కనబడి సర్‌ప్రైజ్ చేసాడు చియాన్.. ఇంతకుముందెన్నడూ కనిపించని సరికొత్త గెటప్స్‌లో ‘కోబ్రా’లో కనిపిస్తున్నాడు.

విక్రమ్ సరసన ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి కథానాయిక కాగా ప్రముఖ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఏ ఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. మే లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. 

Chiyaan Vikram's Cobra First Look