Aakasam Dhaati Vasthaava : కొరియోగ్రాఫర్ యశ్ ‘లో’ బడ్జెట్ ప్రేమ.. ఆకాశం దాటి వస్తావా టీజర్ రిలీజ్..

తన డాన్సులతో ఇన్నాళ్లు అందర్నీ అలరిస్తూ వస్తున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ యశ్.. ఇప్పుడు హీరోగా పరిచయం అవుతూ చేస్తున్న సినిమా 'ఆకాశం దాటి వస్తావా'తో..

choreographer Yash first movie as hero Aakasam Dhaati Vasthaava teaser release

Aakasam Dhaati Vasthaava : ప్రముఖ డాన్స్ షోతో తెలుగు వారందరికీ పరిచయమైన కొరియోగ్రాఫర్ యశ్ (Yash). డాన్స్ షోలో తన డాన్స్ లతో అందర్నీ మెప్పించి టైటిల్స్ అందుకున్న యశ్.. పలు సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. అయితే ఇప్పుడు కెమెరా వెనుక కాకుండా ముందుకు వచ్చి పని చేస్తూ హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. ఆకాశం దాటి వస్తావా అనే లవ్ స్టోరీతో రాబోతున్నాడు. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ కూడా మొదలుపెట్టి శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసే పనిలో పడ్డారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు.

Naga Chaitanya : మత్స్యకారులతో సముద్రంలో చేపల వేటకి వెళ్లిన నాగచైతన్య.. ఎందుకో తెలుసా..?

హీరో హీరోయిన్ మధ్య జరిగే ఒక సంబాషణతో టీజర్ ని నడిపించారు. “సముద్రం దాటి, ఆకాశం దాటి, నాకోసం ఎంత దూరమైన వస్తావా” అని అడిగిన హీరోయిన్ ప్రశ్నకు హీరో బదులిస్తూ.. “మనది కొంచెం లో బడ్జెట్ ప్రేమ. ఒక ట్రైనో, బస్సో ఉన్న ఊరుకి అయితే వచ్చేస్తా” అని వచ్చే డైలాగ్స్ టీజర్ కట్ చాలా బాగుంది. ఒక యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా టీజర్ కనిపిస్తుంది. కార్తీక ముర‌ళీధ‌ర‌న్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తుంది. టీజర్ లో యశ్ అండ్ కార్తీక జోడి ఆకట్టుకునేలా ఉంది. ఒకసారి ఆ టీజర్ ని మీరుకూడా చూసేయండి.

Rajinikanth : రజినీకాంత్ కొత్త సినిమాలో నాని ప్రత్యేక పాత్ర.. నిజమేనా..?

శశికుమార్ ముత్తులూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. గాయకుడు కార్తీక్ ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కొత్త వాళ్ల‌ను ప్రోత్స‌హించేందుకు, కొత్త కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించేందుకు దిల్ రాజ్‌ ప్రొడ‌క్ష‌న్స్(Dil Raju Productions) అనే నిర్మాణ సంస్థను దిల్ రాజు.. ఇదే నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవల ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి బలగంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమా పై ఆడియన్స్ లో ఓ మాదిరి ఆసక్తి మొదలైంది. ఈ టీజర్ తో అది మరికొంచెం పెరిగే అవకాశం ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు