CID 2 : బుల్లితెర ఆడియన్స్ గెట్ రెడీ.. ఆరేళ్ళ బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చిన CID 2..

CID 2 : బుల్లితెర ఆడియన్స్  గెట్ రెడీ.. ఆరేళ్ళ బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చిన CID 2..

CID 2 is back after a break of six years

Updated On : October 26, 2024 / 11:49 AM IST

CID 2 : బుల్లితెర ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూసే, ఆదరించే సిరీస్ లో CID కూడా ఒకటి. కేవలం తెలుగు, హిందీలోనే కాకుండా అన్ని భాషల్లో డబ్ అయిన ఈ సిరీస్ కి హీరో హీరోయిన్స్ తరహా ఫాన్ బేస్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గా వచ్చిన ఈ సిరీస్ కి యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ ఉన్నాయి. అయితే ఈ సిరీస్ టీవీలో వచ్చేటప్పుడు పెద్దగా చూడలేదు కానీ ఇప్పుడున్న జనరేషన్ మాత్రం చాల ఎంజాయ్ చేస్తుంది అని చెప్పొచ్చు.

Also Read : Chiranjeevi : మెగాస్టార్ నటప్రస్థానానికి 50 ఏళ్ళు.. చిరంజీవి స్పెషల్ పోస్ట్ వైరల్..

అయితే ఇప్పుడు ఈ సిరీస్ కి సీక్వెల్ ప్రకటించారు నిర్వాహకులు. దాదాపుగా ఆరేళ్ళ విరామం తర్వాత మళ్ళీ ఈ సిరీస్ రానుంది. క్రిస్ట్మస్ కానుకగా ఈ సిరీస్ రిలీజ్ చేస్తారట. తాజాగా దీనికి సంబందించిన ప్రోమో సైతం విడుదల చేశారు టీమ్. ఇందులో ఉండబోయే టీమ్ గురించి ప్రోమోలో చూపించారు. కాగా నవంబర్ నుండి ఈ సిరీస్ యొక్క షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారట.

ఇక గతంలో వచ్చిన సిరీస్ లో ఏసీపీ ప్రథ్యూమ్న, జోసెఫ్, అభిజిత్, ప్రణిత్, సారిక, రాహుల్ ఇలా వీరందరి పాత్రకి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో తెలిసిందే. మరి ఇప్పుడు CID 2 ఎటువంటి ఆదరణ పొందుతుందో చూడాలి.