ప్రముఖ సినిమా డైరెక్టర్ మారుతీ 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. సినీ జీవిత విశేషాలను వివరించారు.
ప్రముఖ సినిమా డైరెక్టర్ మారుతీ 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తన బాల్యం, సినీ జీవిత విశేషాలను వివరించారు. ఆయన తెలిసి మరిన్ని వివరాలను మారుతి మాటల్లోనే చూద్దాం….
యాంకర్ స్వప్న : ఒక పెద్ద హీరో, కమర్షియల్ హీరోతో మీ కథలను ఎందుకు అటెంప్టు చేయలేదు?
డైరెక్టర్ మారుతి : కొంచెం ఆలోచించుకుని వెళ్దామని అనుకున్నాను. ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు చేసే సినిమాల్లో స్టార్ హీరోలతో చేసేవే. ఇప్పుడు రైట్ టైమ్.
యాంకర్ స్వప్న : మీకు బాగా తిక్క, దానికొ లెక్క అనేవారు నిజమా?
డైరెక్టర్ మారుతి : నాకు అస్సలు తిక్క లేదు. నా టీమ్ ను అడగండి అలా ఉంటే అందరూ బయటికి వచ్చే వారు. ఇండస్ట్రీలో నెగెటివ్, పాజిటివ్ ను దాచలేం. బాగా పని చేస్తే ఇతనితో పని చేయాలని ఆర్టిస్టులు చెబుతారు. కొంచెం మెంటల్ ఉందంటే మెంటల్ తిరుగుంది. మన బిహేవియర్ వందమంది చూస్తారు. కచ్చితగా వారి బ్లెసింగ్ తెలిసిపోతాయి. వీడు మంచి డైరెక్టర్, ఈయనకు మరిన్ని సినిమాలు రావాలి. ప్రశాంతంగా పని చేసుకోవాలని ఫీలింగ్ వస్తే వారి బ్లెస్సింగ్ మనల్ని లిఫ్ట్ చేస్తుంది.
యాంకర్ స్వప్న : మీరు చేసిన ఏ సినిమాల్లో మీకు ఎక్కువగా డబ్సులు వచ్చాయి?
డైరెక్టర్ మారుతి : రెమ్యునరేషన్ పరంగా అయితే ప్రతిరోజూ పండగే. నాకు మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. వంశీ నాకు కారు కూడా గిఫ్ట్ ఇచ్చాడు. రేంజ్ రోవర్ ఇచ్చాడు.
హీరోయన్ నాటిగా ఉండాలి. అమ్మాయి యాక్టివ గా ఉండాలి.. హిరోయిన్ అంటే పాటల కోసం, ఫైట్స్ వచ్చి ఎళ్లినట్లు కాకుండా మన నిజ జీవితంలో ఉండే అమ్మాయిలా ఉండాలి. అందుకే ప్రతిరోజూ పండగేలో టిక్ టాక్ లు చేసే అమ్మాయి. అమ్మాయిల్లో కొంచెం ఇనోసెన్స్ ఉంటే వారి అందం మరింత రెట్టింపు కనబడుతుంది. ముదురు ఆలోచనలు, ముదురుగా మాట్లాడుతుంటే అబ్బో ఎంట్రా అనిపిస్తుంది. డైరెక్టర్ కు కామన్ సెన్స్ ఉండాలి. వాళ్లు చేసే యాక్టింగ్ జడ్జ్ చేయకల్గుతామన్నారు.
యాంకర్ స్వప్న : మీ ఫెవరేట్ డైరెక్టర్ ఎవరు?
డైరెక్టర్ మారుతి : నాకు హాలీవుడ్ డైరెక్టర్స్ తెలియదు. నాకు ఇష్టమైన డైరెక్టర్స్ కె.విశ్వనాథ్. జంద్యాల, వంశీగారి సినిమాలు నాకు బాగా ఇష్టం. రాజమౌళి విజువలైజేషన్ బాగా ఇష్టం. త్రివిక్రమ్.. పెద్ద కంటెంట్ ను రెండు లైన్లకు లాక్కొచ్చి చెప్పడానికి ఇష్టపడతారు. శేఖర్ కమ్ముల నేచురల్ గా తీయడానికి ఇష్టపడతారు. బుక్స్ చదవను. సినిమాలు చూస్తాను. యానిమేషన్స్ సినిమా తీయాలని ఉంది. వీఎఫ్ ఎక్స్ తీయాలని ఉంది. హిట్ అనేది హార్ట్ కు టచ్ కావాలి. ఆత్మను పట్టుకోవాలి.
యాంకర్ స్వప్న : మీరు ఏమైనా అవార్డులు ఆశిస్తున్నారా?
డైరెక్టర్ మారుతి : అవార్డులు ఆశించి సినిమా తీయడం వేరు..ఆడియన్స్ మెప్పించాలని సినిమా తీయడం వేరు. నేను ఆడియన్స్ మెప్పించాలని సినిమా తీస్తాను. అవార్డుల కోసమే సినిమాలు అనుకోలేదు. ఉన్నస్థాయి నుంచి దిగకుండా చూసుకోవాలి. పెద్ద సినిమా ఫెయిల్ అయితే మనీ రిస్క్ లు ఉంటాయి. ఎవరి దగ్గర పనిచేయకుండా డైరెక్టర్ అయిపోయాను. కొన్ని సినిమాలు తీసిన తర్వాత నేను డైరెక్టర్ అనుకున్నాను. నానితో సాటిఫ్యాక్షన్ వేరే వారితో రాకపో్వచ్చు అని అన్నారు.
యాంకర్ స్వప్న : మీ ప్రాజెక్టును ఎలా అప్రోచ్ అవుతారు?
డైరెక్టర్ మారుతి : ఏ హీరో నాతో సినిమా తీయడానికి ఆసక్తిగా ఉన్నాడు. వారు కూడా డైరెక్టర్ ను ప్రేమించాలి, ఇష్టపడాలి. డైరెక్టర్ తో వర్క్ చేయాలని అనుకోవాలి. కృష్ణా నగర్ లో ఏ తలుపు తట్టిన మంచి కథలతో ఉంటారు.