RRR : నాటు నాటు ఆస్కార్ గెలుచుకోవడం పై సినీ సెలబ్రెటీస్ ట్వీట్స్..

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం 'RRR' సినిమాలోనే నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యి చరిత్ర సృష్టించడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ ని అందుకోవడంతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలోని సెలబ్రెటీస్..

cinema celebrities comments on naatu naatu song winning oscar award

RRR : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘RRR’. ఈ సినిమాలోనే నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యి చరిత్ర సృష్టించడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఎం ఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ వచ్చిన ఈ సాంగ్ కి చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాటని పాడారు. ప్రేమ్ రక్షిత్ డాన్స్ కోరియోగ్రఫీ చేశారు. ప్రపంచం మొత్తం అభిమానం సంపాదించుకున్న ఈ సాంగ్ ఇప్పుడు ప్రపంచంలోని ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్ ని అందుకోవడంతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలోని సెలబ్రెటీస్ అంతా సోషల్ మీడియా వేదికగా RRR టీంకి అభినందనలు తెలియజేస్తున్నారు.