Cinema Ticket Rates : ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చిన్న సినిమాల‌ టికెట్ రేట్లు తగ్గుతాయి..

తెలంగాణాలో సినిమా టికెట్ల ధరని విపరీతంగా పెంచడంతో చిన్న సినిమా నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకి సపోర్ట్ అయ్యేలా తాజాగా ఈ విషయంపై తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్........

Movie Ticket Rates

Cinema Ticket Rates :   ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా టికెట్ల ధర వార్తల్లో నిలుస్తుంది. సినిమా టికెట్ ధర అటు ఏపీలో కనీస ధర కంటే తక్కువ పెట్టడంతో సినీ పరిశ్రమ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు తెలంగాణాలో కనీస ధరల కంటే చాలా ఎక్కువ పెట్టడంతో ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ సినిమా టికెట్ల వివాదం అటు సినీ పరిశ్రమని, ఇటు ప్రేక్షకులని నిద్రపోనివ్వట్లేదు.

తెలంగాణాలో సినిమా టికెట్ల ధరని విపరీతంగా పెంచడంతో చిన్న సినిమా నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. చిన్న సినిమాలకి సపోర్ట్ అయ్యేలా తాజాగా ఈ విషయంపై తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ మాట్లాడారు. తెలంగాణాలో సినిమా టికెట్ల రేట్ల పెంపుని సమర్థిస్తూ తెలంగాణా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ తరపున కేసిఆర్, కేటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ధన్యవాదాలు తెలిపారు.

vishwaksen : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ కి కరోనా పాజిటివ్

అయితే టికెట్ రేట్ల‌ పెంపు జీవోను కరెక్ట్ గా వాడుకోవాలన్నారు. పెద్ద సినిమాలకు రేట్లు ఎక్కువగా ఉన్నా, చిన్న సినిమాలకు మాత్రం తక్కువ రేట్లు ఉండేలా చూస్తామని తెలిపారు. చిన్న సినిమాలకు మినిమమ్ ప్రైజ్, మీడియమ్ సినిమాలకు వారంపాటు మ్యాక్జిమమ్ ప్రైజ్, పెద్ద సినిమాలకు రెండు వారాలు మ్యాక్జిమమ్ ప్రైజ్ ఉండేలా చూస్తామన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత విడుదలయ్యే చిన్న సినిమాల‌కి టికెట్ ప్రైజ్ తక్కువగానే ఉంటుందని తెలిపారు.