Cinematographer Kishore : 17 రోజుల్లోనే వెబ్ సిరీస్ షూట్ కంప్లీట్.. సినిమాటోగ్రాఫర్ కిషోర్ బోయిడాపు ఇంటర్వ్యూ..

తాజాగా ఈ సిరీస్ కి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ కిషోర్ బోయిడాపు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు. (Cinematographer Kishore)

  • Published on- May 26, 2026 / 03:16 PM IST

Cinematographer Kishore

Cinematographer Kishore : నాగబాబు మెయిన్ లీడ్ లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌ మంచి రీచ్ అందుకుంది. ప్ర‌స్తుతం ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ సక్సెస్ తో తాజాగా ఈ సిరీస్ కి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ కిషోర్ బోయిడాపు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు.

కిషోర్ బోయిడాపు తన గురించి చెప్తూ.. మా ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలోనే ఉండటంతో నాకు కూడా ఇంట్రెస్ట్ ఏర్పడి కెమెరా మీద ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చా. 2002లో రవి ప్రసాద్ దగ్గర కెమెరా అసిస్టెంట్‌గా కెరీర్ మొదలుపెట్టా. ఆ తర్వాత స్లమ్ డాగ్ మిలియనీర్, ‘మిషన్ ఇంపాజిబుల్ 4’, కొన్ని హాలీవుడ్ సినిమాలకు కెమెరా డిపార్ట్మెంట్ లో పనిచేసే. 2015 లో స్టార్ సినిమాటోగ్రాఫర్ అనిల్ మెహతా వద్ద జ‌ర్నీ మొదలయింది. ఆయనతో ‘ఏ దిల్ హై ముష్కిల్’ నుంచి జెర్సీ వరకు చాలా సినిమాలకు పనిచేసే. కరోనా తర్వాత మై నేమ్ శృతి,105 మినిట్స్‌ సినిమాలతో సినిమాటోగ్రాఫర్ గా మారాను అని తెలిపారు.

Also See : Sekhar Master: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శేఖర్ మాస్టర్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

మేము కాప్’లం సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఈ సిరీస్ షూటింగ్‌ను కేవలం 17 రోజుల్లోనే పూర్తి చేశాం. ప్రీ-ప్రొడక్షన్ పర్ఫెక్ట్ గా చేసుకోవడం, అన్ని డిపార్ట్‌మెంట్స్ వాళ్ళు కష్టపడి పనిచేయడంతోనే ఇది సాధ్యమైంది. లొకేషన్ రెక్కీ చేస్తున్న టైంలోనే ఏ సీన్‌ని ఎలా తీయాలి, ఎంతలో తీయాలి అని నేను, ప్రదీప్ డిస్కస్ చేసుకున్నాం అని తెలిపారు కిషోర్.

తన పనిలో ఛాలెంజెస్ గురించి చెప్తూ. హన్సికతో చేసిన ‘105’ సినిమా సింగిల్ కారెక్టర్‌తో, సింగిల్ షాట్‌తోనే చేసాము. అలా సింగిల్ షాట్ తో చేయడం చాలా కష్టం. ఏ ఒక్క చోట మిస్టేక్ జరిగినా మళ్లీ మొత్తం మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు ఫిల్మ్‌తో షూట్ చేయడం వల్ల లెంగ్త్‌ని చూస్తూ షూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు లిమిటేషన్స్ లేవు.ఎన్ని టేక్స్ అయినా తీసుకుంటారు. షణ్ముఖ్ హీరోగా చేస్తున్న ‘ప్రేమకు నమస్కారం’ సినిమాకు నేను కుక్ 7 లెన్స్‌లని వాడాను అని తెలిపారు.

Also See : Divyendu Sharma: ‘పెద్ది’ ఒక గొప్ప కథ.. ఆయన కోసం ఏదైనా చేయాలనుకున్నా.. దివ్యేందు శర్మ ఆసక్తికర కామెంట్స్

కిషోర్ తన తర్వాత సినిమాల గురించి చెప్తూ.. షణ్ముఖ్ చేసిన ‘ప్రేమకు నమస్కారం’ సినిమా చేశాను. రాజీవ్ కనకాల చేసిన మన డాక్టర్ బాబు అనే సినిమా చేశాను. ఇంకో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. దర్శకుడు అయ్యే ఆలోచన ఇప్పట్లో లేదు. దానికి చాలా సమయముంది. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను అని తెలిపారు.

సినిమాటోగ్రాఫర్ కిషోర్ బోయిడాపు పలు హాలీవుడ్ సినిమాల్లో కూడా పని చేయడంతో అక్కడ, ఇక్కడ ఉన్న కలర్ టోన్ గురించి తేడాలు చెప్తూ.. హాలీవుడ్ సినిమాల్లో కలర్ టోన్ ఎక్కువగా నేచురల్‌, సాఫ్ట్‌, సినిమాటిక్‌గా ఉంటుంది. వాళ్లు రియ‌లిస్టిక్ లైటింగ్‌, కంట్రోల్డ్ క‌లరింగ్ ఉప‌యోగిస్తారు. ఇండియ‌న్ సినిమాల్లో మాత్రం వైబ్రంట్ క‌ల‌ర్స్‌, రిచ్ స్కిన్ టోన్స్‌, ఎమోష‌న‌ల్ లైటింగ్ ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. హాలీవుడ్ సినిమాలు ఏస్‌, రా, హెచ్‌డిఆర్ వంటి అడ్వాన్స్ క‌ల‌ర్ వ‌ర్క్ ఫ్లోల‌ను ఉప‌యోగిస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే హాలీవుడ్ క‌ల‌ర్స్‌ను రియలిస్టిక్‌గా చూపిస్తుంది. ఇండియ‌న్ సినిమా క‌ల‌ర్‌ను ఎమోష‌న‌ల్‌గా, క‌ల్చ‌ర‌ల్లీ రిచ్‌గా చూపిస్తుంది. కొన్నిసార్లు వాళ్లు,మనం సేమ్ లెన్స్ వాడతాం. కాకపోతే డీఐకి వాళ్లు ఎక్కువ టైం తీసుకుంటారు. ఇక్కడ మనకు అంత టైం ఉండదు అని చెప్పుకొచ్చారు.