Clarity On Vijay Devarakonda Controversy In Press Meet
Vijay Devarakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో మనం చూస్తున్నాం. దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాక్సర్‌గా విజయ్ దేవరకొండ నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ ఆతృతగా ఉన్నారు. ఇక ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తేందుకు లైగర్ టీమ్ ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తోంది. అయితే ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్యా పాండేలు మీడియా వారితో ముచ్చటించారు. ఇక ఈ ప్రెస్‌మీట్‌లో విజయ్ తన రెండు కాళ్లను టేబుల్‌పై పెట్టుకుని కూర్చోవడంతో సోషల్ మీడియాలో ఈ ప్రెస్‌మీట్ వివాదం పెద్ద దుమారమే లేపుతోంది.
Vijay Devarakonda: డ్యాన్స్ అంటే ఏడుపే అంటోన్న లైగర్!
అయితే ఈ ప్రెస్‌మీట్ వివాదంపై తాజాగా విజయ్ స్పందించాడు. జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఇలాంటి వార్తలు వస్తుంటాయని.. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవాలని విజయ్ అన్నాడు. కాగా, ఈ ప్రెస్‌మీట్‌లో అసలేం జరిగిందో ఓ జర్నలిస్ట్ వివరణ ఇచ్చాడు. విజయ్ మీడియా వారితో చాలా జాలీగా ఉంటాడని ఆయన తెలిపాడు. ఇక ఈ ప్రెస్‌మీట్‌లో ఓ జర్నలిస్టు విజయ్ నటించిన టాక్సీవాలా రోజులు గుర్తుకు చేశాడని.. ఆ సమయంలో విజయ్ తమతో ఎంతో సరదాగా ఉండేవాడని.. కానీ ఇప్పుడు లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని.. ఆయనతో మాట్లాడలంటే కాస్త బెరుకుగా ఉందని ఓ విలేకరి అన్నాడట.
Liger Press Meet: ‘లైగర్’ ప్రెస్ మీట్‌లో సందడి చేసిన విజయ్ దేవరకొండ, అనన్యా పాండే!
దీంతో విజయ్ వెంటనే స్పందిస్తూ అవన్నీ పట్టించుకోవద్దని.. తనతో ఎప్పటికీ సరదాగా ఉండవచ్చని తెలిపాడట. మీరు కాలు మీద కాలు వేసుకుని కూర్చోండి.. నేను కూడా కాలిపై కాలేసుకుని కూర్చుంటానన్న విజయ్ తన కాళ్లను టేబుల్‌పై పెట్టాడని సదరు విలేకరి తెలిపారు. అలా విజయ్ చేసిన సరదా పనికి అక్కడున్న మీడియా వారంతా నవ్వుకున్నట్లు తెలిపారు. ఇలా విజయ్ దేవరకొండ ప్రెస్‌మీట్ సందర్భంలో కాళ్లను టేబుల్‌పై పెట్టడానికి వెనకాల ఏం జరిగింతో ఇలా విలేకరి క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు ఈ వివాదానికి తెరపడినట్లు అయ్యింది.