2 గంటల 8 నిమిషాల మహానాయకుడు

మహానాయకుడు సెన్సార్ పూర్తి.

  • Publish Date - February 16, 2019 / 11:16 AM IST

మహానాయకుడు సెన్సార్ పూర్తి.

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2, ఎన్టీఆర్ మహానాయకుడు మూవీని ఫిబ్రవరి 22 న రిలీజ్ చెయ్యడానికి రంగం సిద్థం చేస్తుంది మూవీ యూనిట్. నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, దగ్గుబాటి రానా, నందమూరి కళ్యాణ్ రామ్, సచిన్ కేద్‌కర్ తదితరులు నటించిన మహానాయకుడు సెన్సార్ పనులు రీసెంట్‌గా పూర్తయ్యాయి.. సినిమా చూసిన సెన్సార్ టీమ్.. క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది. రెండు గంటల ఎనిమిది నిమిషాల నిడివితో ముగియనుంది. ఫస్ట్ పార్ట్ ఎన్టీఆర్ కథాయకుడు నిడివి దాదాపు మూడు గంటలు.. సెకండ్ పార్ట్ ఎక్కడా సాగదీసినట్టు అనిపించకుండా, గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దారట..

ఎన్టీఆర్ రాజకీయ రంగంలో అడుగుపెట్టిన తర్వాత, రాష్ట్ర రాజకీయాల్లో తీసుకొచ్చిన పెనుమార్పులు, సినీ, రాజకీయ, కుటుంబ నేపథ్యంలో ఎమోషనల్‌గా క్రిష్, మహానాయకుడిని తెరకెక్కించాడని, తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందని సెన్సార్ సభ్యులు అన్నారు. ఫిబ్రవరి 16 సాయంత్రం మహానాయకుడు ట్రైలర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఎన్‌బీకే ఫిలింస్, విబ్రి మీడియా, వారాహి చలనచిత్రం నిర్మించిన ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22 న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.