Colours Swathi : రెండో పెళ్లి చేసుకున్న క‌ల‌ర్స్ స్వాతి.. త‌న సినిమా ద‌ర్శ‌కుడినే..

Colours Swathi : హీరోయిన్ క‌ల‌ర్స్ స్వాతి మ‌ళ్లీ పెళ్లి చేసుకుంది.

Colours Swathi second marriage with Director Srikanth nagothi

Colours Swathi : హీరోయిన్ క‌ల‌ర్స్ స్వాతి మ‌ళ్లీ పెళ్లి చేసుకుంది. అది కూడా ఓ టాలీవుడ్ ద‌ర్శ‌కుడిని. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్వాతి వెల్ల‌డించింది. అంతేకాదండోయ్ పెళ్లి ఫోటోల‌ను పంచుకుంది.

తెలుగు అమ్మాయి అయిన స్వాతి.. క‌ల‌ర్స్ ప్రోగ్రాంతో యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌రువాత 2005లో డేంజ‌ర్ మూవీతో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. అష్టాచ‌మ్మా మూవీతో హీరోయిన్ అయింది. ఆ త‌రువాత క‌థ స్ర్కీన్ ప్లే అప్ప‌ల్రాజు, కార్తికేయ‌, స్వామి రారా, పంచతంత్ర‌, గోల్కొండ హైస్కూల్ మూవీల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేసింది.

Bhagyashri Borse : లెనిన్ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో భాగ్య‌శ్రీ బోర్సే .. ఫోటోలు వైర‌ల్

కెరీర్ మంచి పీక్స్ టైమ్‌లో 2015లో వికాస్ వాసు అనే ఫైలెట్‌ని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల పాటు స‌జావుగా ఉన్నా ఆ త‌రువాత వీరిద్ద‌రు విడాకులు తీసుకున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఆ ప్రచారంపై స్వాతి ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. పెళ్లి త‌రువాత సినిమాల‌కు దూరం అయిన స్వాతి.. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

అయితే.. ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ నాగోతినే స్వాతి రెండో పెళ్లి చేసుకుంది. అత‌డితో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమగా మారి, ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. స్వాతి పోస్టు చేసిన ఫోటోల‌ను బ‌ట్టి వీరి పెళ్లి చాలా సింపుల్‌గా జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యం తెలిసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.