ఆలీకి కోపం వచ్చింది: రివ్యూ రైటర్లపై రెచ్చిపోయారు

  • Publish Date - October 22, 2019 / 02:18 AM IST

టాలీవుడ్ సీనియర్  కమెడియన్ ఆలీకి కోపం వచ్చింది. సినిమా రివ్యూలు రాసే క్రిటిక్స్‌పై మండిపడ్డారు. మీరేమైనా తోపులా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. బాలేదని అనడానికి మీరు ఎవరు?  ‘కోన్ కిస్కా గొట్టాం గాళ్లు, మూర్ఖులు..’ అంటూ పెద్ద పెద్ద ప‌దాల‌నే వాడేశారు.

సడెన్‌గా క్రిటిక్స్‌పై ఆయనకు కోపం ఎందుకు వచ్చిందంటే.. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో ఆలీ నటించిన ‘రాజుగారి గ‌ది 3’ సినిమాకు నెగిటీవ్ రివ్యూలు రావడమే. ఈ శుక్ర‌వారం(18 అక్టోబర్ 2018) విడుద‌లైన ఈ సినిమాకి రేటింగులు దారుణంగా వ‌చ్చాయి. ఆలీ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం. ఇటీవలికాలంలో ఆలీ నటించిన సినిమా ఇది మాత్రమే.

ఆలీ చాలా గ్యాప్ తీసుకుని నటించిన ఈ సినిమాపై నెగెటివ్ రివ్యూలు రావడంతో ఆలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత‌మంది మూర్ఖులు ప‌నిగ‌ట్టుకుని సినిమాపై రాళ్లు విసురుతున్నారని, వారిని ప‌ట్టించుకోన‌ని అలీ చెప్పుకొచ్చారు.

అంతేకాదు కూకట్‌పల్లి భ్ర‌మ‌రాంబ ధియేట‌ర్లో తాను ఈ సినిమా చూశాన‌ని, అక్క‌డ ప్రేక్ష‌కులు హాయిగా న‌వ్వుకున్నార‌ని, త‌మ టీమ్‌ని అభినందించార‌ని, ప్రివ్యూ థియేట‌ర్లో మాత్రం.. త‌మ సొమ్ములేవో పోయిన‌ట్టు జ‌నాలు న‌వ్వ‌లేదని, అందుకే ఇక మీద‌ట ప్రివ్యూ థియేట‌ర్లో సినిమాలు చూడ‌కూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఎవ‌రో కోన్ కిస్కా గొట్టంగాళ్ల గురించి సినిమాలు తీయ‌మ‌ని, ప్రేక్ష‌క దేవుళ్ల కోసమే సినిమాలు తీస్తామ‌ని అన్నారు.