×
Ad

Jabardasth Naresh : నాకు టీమ్ లీడర్ వద్దు.. నా మీద కంప్లైంట్స్ ఇచ్చారు.. నరకం అది.. జబర్దస్త్ పై నరేష్ వ్యాఖ్యలు వైరల్..

బర్దస్త్ నరేష్ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు విషయాలు మాట్లాడుతూ జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా చేయడం ఎంత నరకమో చెప్పుకొచ్చాడు. (Jabardasth Naresh)

Jabardasth Naresh

Jabardasth Naresh : తన హైట్ ని అడ్వాంటేజ్ గా మార్చుకొని కామెడీ చేస్తూ జబర్దస్త్ షోతో మంచి ఫేమ్ తెచ్చుకున్న నరేష్ ఇప్పుడు జబర్దస్త్, శ్రేదేవి డ్రామా కంపెనీ, టీవీ లో పలు షోలు, బయట ఈవెంట్స్, అప్పుడప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.(Jabardasth Naresh)

తాజాగా జబర్దస్త్ నరేష్ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు విషయాలు మాట్లాడుతూ జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా చేయడం ఎంత నరకమో చెప్పుకొచ్చాడు. అందరి టీమ్స్ లోను చేసే నరేష్ మధ్యలో కొన్నాళ్ళు టీమ్ లీడర్ గా కూడా చేసాడు.

Also Read : Jabardasth Naresh : ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నరేష్..

జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా చేయడంపై నరేష్ స్పందిస్తూ.. నాకు టీమ్ లీడర్ వద్దు. ఆ ట్యాగ్ కూడా వద్దు. నేను 36 స్కిట్స్ టీమ్ లీడర్ గా చేసాను. అది నరకం కనపడింది. నాలుగు రోజుల ముందు లైన్ చెప్పాలి, కాస్ట్యూమ్, ప్రాపర్టీస్ చెప్పాలి. లైన్ ఓకే అవ్వకపోతే తిరగలి. అది చాలా కష్టం. రీసెంట్ గా రిక్వెస్ట్ చేస్తే కొన్ని స్కిట్స్ కి తప్పక చేస్తున్నా. అది టెంపరరీ మాత్రమే. టీమ్ లీడర్ గా చేయడం తప్పు అనిపించింది నాకు. స్కిట్స్ మీద ఎక్కువ అవగాహన లేనప్పుడు నాకు టీమ్ లీడర్ ఇచ్చారు సరిగ్గా చేయలేకపోయాను. దాని వల్ల నా కెరీర్ వెనక్కు వెళ్ళింది అనిపించింది అని తెలిపాడు.

అలాగే నరేష్.. నా మీద జబర్దస్త్ లో కంప్లైంట్ ఇచ్చారు. నాతో పనిచేసేవాళ్ళే ఇచ్చారు. అతనికి ఎందుకు ఎక్కువ ఎపిసోడ్స్ ఇస్తారు అని మాట్లాడారు. ఆ విషయంలో నేను బాధపడ్డాను, జాగ్రత్త పడతాను అని అన్నాడు. దీంతో జబర్దస్త్ గురించి నరేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Also Read : Heroine : తల్లిని అవమానించిన రిలేటివ్స్.. కసితో ఏకంగా బెంజ్ కార్ కొన్న హీరోయిన్..