Rahul Ramakrishna: తూచ్ నేను జోక్ చేశా.. అందరినీ ఫూల్స్ చేసిన రాహుల్!
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ అనుహ్య నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు.
- Naresh Mannam
- Published On : February 6, 2022 / 07:30 AM IST
Rahul Ramakrishna
Rahul Ramakrishna: తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ అనుహ్య నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. తాను సినిమాల నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నామని.. ఇకపై నటించనని.. 2022 వరకు మాత్రమే తాను మూవీల్లో నటిస్తానని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆకస్మాత్తుగా రాహుల్ ఈ నిర్ణయం తీసుకోవడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.
Tollywood : రేపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం
రాహుల్ రిటైర్మెంట్ ఏంటని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. భారీ సినిమా ఆఫర్లు చేతిలో ఉన్న సమయంలో ఈ రిటైర్మెంట్ ఏంటని కొందరు ఏకంగా రాహుల్ కు ఫోన్ చేసి అడగడం.. ఆయన స్నేహితులు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడంతో రాహుల్ రామకృష్ణ దీనిపై మరోసారి స్పందించాడు. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తాను జస్ట్ జోక్ చేశానని.. ఇలా ప్రకటిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందా అని టెస్ట్ చేశానని చెప్పాడు.
Salaar: బాప్ రే.. సలార్ ఓటీటీ రైట్స్ కోసం రూ.200 కోట్ల ఆఫర్?
సినిమాలు చేయనని జోక్ చేశానని.. భారీ రెమ్యునరేషన్, విలాసమైన జీవితం, ఎన్నో ప్రయోజనాలను ఎందుకు వదులుకుంటాను?. నేను రిటైర్మెంట్ చెప్పానని నన్ను అభినందించడానికి నా స్నేహితులు ఫోన్ చేయడం నిజంగా నమ్మలేకపోయానని ఆశ్చర్యం వ్యక్తం చేసిన రాహుల్ కేవలం సరదా కోసమే ఇలా చేశానని చెప్పాడు. దీనిపై కొందరు నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. ఇలా నీ సరదా కోసం అందరినీ ఫూల్స్ చేయడం ఏంటని సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు.
https://twitter.com/eyrahul/status/1489947310260101124?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1489947310260101124%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-35902002824291141256.ampproject.net%2F2201212122003%2Fframe.html
https://twitter.com/eyrahul/status/1489648833252704257
