Comedian Rama Chandra
Comedian Rama Chandra : వెంకీ సినిమాలో రవితేజతో ఉన్న ఫ్రెండ్స్ గ్రూప్ లో కమెడియన్ రామచంద్ర ఒకరు. రామచంద్ర ఆ సినిమాలో తన కామెడీతో ఫుల్ గా నవ్వించాడు. ఆ తర్వాత గౌతమ్ SSC సినిమాలో కూడా ప్రేక్షకులను నవ్వించాడు. అనేక సినిమాల్లో కమెడియన్ గా, చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఆల్మోస్ట్ అందరి స్టార్ హీరోల సినిమాల్లో కెరీర్ తొలినాళ్లలో నటించాడు. అనంతరం అవకాశాలు దూరమయ్యాయి. ఇటీవల డీజే టిల్లు, సర్ సినిమాల్లో చిన్న పాత్రలు చేసాడు.(Comedian Rama Chandra)
అయితే ఓ 20 రోజుల ముందు వరకు కూడా బాగానే ఉన్న రామచంద్ర సడెన్ గా పక్షవాతానికి గురయ్యారు. ఓ 20 రోజుల క్రితమే ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.
Also Read : Dasari Kiran Arrest: వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్.. ఆ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు..
తాజాగా అదే ఛానల్ అతని ఇంటికి వెళ్లి మాట్లాడింది. దీంతో రామచంద్ర మాట్లాడుతూ.. ఒక 15 రోజుల క్రితం చిన్న డెమో షాట్ ఉంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక సడెన్ గా కాళ్ళు, చేతులు లాగేయడం జరిగింది. దాంతో నాకు హెల్త్ బాగోలేదని చెప్పి షూట్ నుంచి వచ్చేసాను. రెండు రోజుల తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్తే స్కాన్ చేసి పెరలాసిస్ అని చెప్పారు. అప్పటికే అటాక్ అయిందట. బ్రెయిన్ లో రెండు క్లాట్స్ ఉన్నాయని చెప్పారు. లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ మొత్తం పనిచేయడం ఆగిపోయాయి. బ్రెయిన్ లో క్లాట్స్ పోతే ఇది పోతుందని చెప్పారు. ప్రస్తుతానికి మందులు ఇచ్చారు వాడుతున్నాను అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.