Janasena
Riyaj : ‘అదిరింది’ షో ద్వారా కమెడియన్ రియాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ షోలో తన కామెడీతో అందర్నీ అలరించాడు. ఇప్పుడు యూట్యూబ్ లో కొన్ని వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా చిన్న చిన్న పత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికే రియాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని షోలో వేసే స్కిట్స్ ద్వారా తెలిపాడు. చాలా మంది సెలబ్రిటీలు, ఆర్టిస్టులు జనసేనకు బయట నుంచి మద్దతు ఇస్తున్నారు కానీ ఎవరూ జనసేనలో చేరట్లేదు. అలా చేరిన వాళ్ళని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు.
Nyattu Remake : మరో మలయాళం రీమేక్… పోలీసు పాత్రల్లో ప్రియదర్శి, అంజలి
తాజాగా రియాజ్ తాను జనసేన పార్టీలో చేరుతున్నానని నెల్లూరులోని 30వ డివిజన్ నుంచి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. త్వరలోనే వీటి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఎలక్షన్స్ లో జనసేన కూడా పోటీ చేయబోతుంది. దీంతో ఈ సారి నెల్లూరు కార్పొరేషన్ లో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో నెల్లూరు 30వ డివిజన్ నుంచి రియాజ్ పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి రియాజ్ ని చూసే జనసేనకు సపోర్ట్ చేసే సెలబ్రిటీలు జనసేనలో జాయిన్ అవుతారో లేదో చూడాలి.