Comedian Venu : దర్శకుడిగా మారుతున్న జబర్దస్త్ వేణు.. హీరోయిన్ ఎవరో తెలుసా?

తెలుగు పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్'తో ఎంతోమంది నటులు, కమెడియన్‌లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇండస్ట్రీకి రావాలి అనుకునే చాలా మందికి ఈ షో ఒక ద్వారం అయ్యింది. అలా జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన కమెడియన్ 'వేణు'. జబర్దస్త్‌లో తన కామెడీతో అందర్నీ ఆకట్టుకున్న వేణు.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకొని దర్శకుడిగా మారబోతున్నాడు.

Comedian Venu directs his first movie balagam

Comedian Venu : తెలుగు పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’తో ఎంతోమంది నటులు, కమెడియన్‌లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇండస్ట్రీకి రావాలి అనుకునే చాలా మందికి ఈ షో ఒక ద్వారం అయ్యింది. అలా జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన కమెడియన్ ‘వేణు’. జబర్దస్త్‌లో తన కామెడీతో అందర్నీ ఆకట్టుకున్న వేణు.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకొని దర్శకుడిగా మారబోతున్నాడు.

Dil Raju : మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు..

‘బలగం’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక స్టార్ కమెడియన్ గా ఉంటూనే హీరోగా కూడా అడపాదడపా సినిమాలు చేస్తున్న ‘ప్రియ దర్శి’ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో నటించిన ‘బేబీ కావ్య’ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవబోతుంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ కూడా పూర్తీ చేసుకుంది చిత్ర యూనిట్.

దీంతో మూవీ టీమ్ నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి, సినిమా వివరాలను మీడియాకు తెలియజేశారు. ఈ క్రమంలోనే దర్శకుడు వేణు మాట్లాడుతూ.. “బలగం సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. మూవీ మొత్తం సిరిసిల్ల గ్రామంలోనే జరుగుతూ, తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుంది. అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి నచ్చుతుంది. అలాగే నన్ను నమ్మి డైరెక్టర్ గా నాకు ఛాన్స్ ఇచ్చిన శిరీష్ గారికి, దిల్ రాజు గారికి నా కృతజ్ఞతలు” అంటూ వ్యాఖ్యానించాడు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.