×
Ad

Balagam: బలగం తరువాత వేణు మరో ప్రాజెక్ట్.. ఎవరితో తెలుసా?

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన ‘బలగం’ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సినిమా రోజురోజుకూ తన సత్తా చాటుతూ, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పూర్తి ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాతో డైరెక్టర్‌గా వేణు యెల్దండి తన సత్తా చాటుకున్నాడు.

Comedian Venu To Direct Another Movie In Dil Raju Production After Balagam

Balagam: టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన ‘బలగం’ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సినిమా రోజురోజుకూ తన సత్తా చాటుతూ, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పూర్తి ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాతో డైరెక్టర్‌గా వేణు యెల్దండి తన సత్తా చాటుకున్నాడు.

Balagam Movie : బలగం చిత్రయూనిట్ ని అభినందించిన తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్..

కమెడియన్‌గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న వేణు, దర్శకుడిగా చేసిన తొలి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘బలగం’ టోటల్ రన్‌లో ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినమా ఇచ్చిన సక్సెస్‌తో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు వేణు రెడీ అవుతున్నాడట. అయితే, ఈసారి చిన్న సినిమా కాకుండా, ఓ మీడియం బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నాడట.

Balagam : ‘బలగం’ కథ జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ రాసిందా?

ఇక ఈ సినిమాను కూడా బలగం చిత్ర నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్‌తోనే చేయడానికి వేణు అంగీకరించాడట. మరి బలగం తరువాత వేణు చేయబోయే మీడియం బడ్జెట్ మూవీ ఎలాంటి కథతో వస్తుందా.. ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.