కమిట్‌మెంట్: బిగ్ బాస్ కంటెస్టెంట్ హాట్ హాట్‌గా!

  • Published By: vamsi ,Published On : January 29, 2020 / 06:14 PM IST
కమిట్‌మెంట్: బిగ్ బాస్ కంటెస్టెంట్ హాట్ హాట్‌గా!

Updated On : January 29, 2020 / 6:14 PM IST

మాములుగా కమిట్‌మెంట్ అంటే అంకితభావంతో పనిచేయడం.. కానీ సినిమా పరిభాషలో మాత్రం కమిట్‌మెంట్ అంటే సినిమాలో అవకాశం ఇచ్చినందుకు పడకగదిలో సుఖం ఇవ్వడమే.. సామాన్యులకు ఈ విషయం గురించి ప్రత్యేకంగా తెలియదు కానీ, సినిమా ఇండస్ట్రీలో పరిచయం ఉన్నవాళ్లకు మాత్రం ప్రత్యేకంగా ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాధవి లత వంటి హీరోయిన్లు మాత్రం ఈ మాట గురించి అనేక విషయాలను చెప్పారు.

నీకు పలానా సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇప్పిస్తా.. పెద్ద హీరో, పెద్ద బేనర్ మరి చిన్న షరతు ఏంటంటే ‘కమిట్మెంట్’తో పనిచేయాలి ఓకేనా? తరచూ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కి ఎదురయ్యే ప్రశ్నలు ఇవే అంటూ.. కమిట్మెంట్ అంటే ఏమిటో.. ఇండస్ట్రీలో జరగుతున్న చీకటికోణం గురించి హీరోయిన్ మాధవీలత అప్పట్లో సంచలనం అయ్యింది. అయితే లేటెస్ట్‌గా ఈ కమిట్‌మెంట్ అనే మాటే టైటిల్‌గా మారి ఓ వెబ్ సిరీస్ రూపొందుతుంది.

బిగ్‌బాస్ రెండవ సీజన్లలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయిన హీరోయిన్, నటి తేజస్వీ  గురించి ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తేజస్వీకి బుల్లితెరపై అనేక అవకాశాలు వచ్చాయి. అయితే అంతగా తన కెరీర్‌ని బూస్ట్ అప్ చెయ్యడానికి ఉపయోగపడలేదు. ఈ క్రమంలోనే ఈ అమ్మడు.. వెబ్‌సిరీస్‌లను చెయ్యాలని ఫిక్స్ అయ్యింది.

అసలే అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడని తేజస్వీ.. కమిట్మెంట్ అనే వెబ్ సిరీస్‌తో ముందుకు వస్తుంది. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన పోస్టర్‌ను చూస్తే సినిమా కథ, కథనం ఎలా ఉండబోతుంది అనే విషయం అర్థం అవుతుంది. పడకగదలో మనుషులు కనపడకుండా దుప్పటి కప్పుకుని కాళ్లు మాత్రమే కనిపించే విధంగా శృంగార ప్రేరేపితంగా ఉంది ఆ పోస్టర్.. ఆ పోస్టర్‌పై మీరు కూడా లుక్కెయ్యండి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#commitment Coming soon @lakshmikanth_chenna

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) on