పునర్నవిది పెళ్లి కాదు.. ప్రమోషన్!

  • Published By: sekhar ,Published On : October 30, 2020 / 05:44 PM IST
పునర్నవిది పెళ్లి కాదు.. ప్రమోషన్!

Updated On : October 30, 2020 / 11:39 PM IST

Commitmental-Punarnavi Bhupalam: పునర్నవి భూపాలం ఎంగేజ్ మెంట్ అయిపోయింది అనే వార్త రకరకాలుగా వినిపించింది. బుధవారం ఆమె నిశ్చితార్థపు ఉంగరం ఫొటోని చూపిస్తూ.. ‘ఫైనల్లీ ఇట్స్‌హ్యాపెనింగ్‌’ అని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

తర్వాతి రోజు తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఫొటోని బ్లర్‌చేసి అత‌ని పేరు ఉద్భ‌వ్ ర‌ఘునంద‌న్ అని.. మా గురించి మొత్తం మీకు రేపు (శుక్రవారం) తెలియజేస్తానని పేర్కొంది. ఉద్భ‌వ్ ర‌ఘునంద‌న్ కూడా ఫైనల్లీ ఆమె అంగీకరించింది. రేపు (శుక్రవారం) మా జీవితంలో చాలా గొప్పరోజు అని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను.. అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడమే కాకుండా.. పునర్నవితో కలిసి ఉన్న ఫొటోని కూడా షేర్‌చేశాడు. దీంతో వీరి పెళ్లి ఫిక్స్ అనుకున్నారంతా..


కట్ చేస్తే.. పునర్నవి, ఉద్భవ్ కలిసి నటించిన ఓ వెబ్‌సిరీస్‌కోసం ఈ విధంగా ప్రమోషన్స్‌ స్టార్ట్ చేశారని.. పెళ్లి విషయంలో వీళ్లు చెబుతున్నది వాస్తవం కాదని, పునర్నవి చేతికి ఉన్న రింగ్‌ కుడిచేతికి ఉంది కాబట్టి ఇది పెళ్లి మ్యాటర్‌ కానేకాదని, ప్రమోషన్‌ మ్యాటర్‌ అనే మాటలూ వినిపించాయి. ఇప్పుడు ఆ మాటలే నిజమయ్యాయి.


పునర్నవి, ఉద్భవ్ జంటగా నటించిన ‘Commitmental’ (కమిట్‌మెంటల్) వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగమే ఈ పెళ్లి గోల అంతా.. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ఫస్ట్ లుక్ శుక్రవారం రిలీజ్ చేశారు. నవంబర్ 13నుంచి పాపులర్ తెలుగు ఓటీటీ ఆహాలో ఈ సిరీస్ ప్రీమియర్స్ కానుంది.

ImageImage