కరోనా వస్తుందని ఏడేళ్ల క్రితమే తెలుసా.. ఆ సినిమా ఏం చెప్పింది!

Contagion  మూవీ పదేళ్ల కింద హెచ్చరిస్తే.. అదొచ్చిన రెండేళ్లకే.. అంటే 2013లోనే కరోనా వైరస్ రాబోతోందని చేసిన ట్వీట్.. ఇప్పుడు వైరల్ అవుతోంది. అదొక్కటే కాదు.. 1981లో రిలీజైన ఓ థ్రిల్లర్ నావెల్‌లో కూడా ఇదే విషయం ఉంది. ఈ రెండు విషయాలపై.. నెటిజన్లు తెగ డిస్కస్ చేస్తున్నారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో.. హాట్ టాపిక్‌గా మారిన ట్వీట్ ఇదే. మార్క్ అనే యూజర్.. దీనిని 2013లోనే ట్వీట్ చేశాడు. ఏడేళ్ల క్రితమే.. కరోనా వైరస్.. ఇట్స్ కమింగ్ అనే క్యాప్షన్ రాశాడు. కానీ.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడదే కరోనా.. వరల్డ్ మొత్తం డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో.. ఏడేళ్ల కిందటి ఈ ట్వీట్‌పై.. డిబేట్ మొదలైంది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు కొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఇంకొందరేమో.. ట్విట్టర్‌ని హ్యాక్ చేసి.. ట్వీట్‌ డేట్ మార్చేసి ఉంటాడని డౌట్స్ రెయిజ్ చేస్తున్నారు. ఈ ట్వీట్ సంగతి ఇలా ఉంటే.. కంటేజియన్ మూవీ కంటే ముందే.. 1981లో వచ్చిన రిలీజైన ది ఐస్ ఆఫ్ డార్క్‌నెస్ అనే ఓ థ్రిలర్ నావెల్‌లో.. అమెరికా రచయిత డీన్ కూడా ఇదే విషయం గురించి ప్రస్తావించాడు. ఆ నవల పేరు ది ఐస్ ఆఫ్ డార్క్‌నెస్. దీనిలో.. వుహాన్ 400 అనే వైరస్ గురించి రచయిత రాసుకొచ్చాడు.

వుహాన్‌లోని.. చైనీస్ మిలిటరీ ల్యాబ్‌లో ఈ వైరస్‌ను సృష్టిస్తారని.. అదొక బయోలాజికల్ వెపన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉంటుందని.. ఆ పుస్తకంలో ఉందని చెబుతున్నారు. ఈ విషయం కూడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.