కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త సినిమాలు

2019 టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్

  • Publish Date - January 1, 2019 / 10:04 AM IST

2019 టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్

కొత్త ఆశలతో 2019లోకి ప్రవేశించింది టాలీవుడ్. 2018లో బాలయ్య జైసింహా, రామ్ చరణ్ రంగస్థలం, మహేష్ భరత్ అనే నేను, ఎన్టీఆర్ అరవింద సమేత, వరుణ్ తేజ్ తొలిప్రేమ, కీర్తి సురేష్ మహానటి, అనుష్క భాగమతి, విజయ్ దేవరకొండ గీతా గోవిందం, టాక్సీవాలా, సుధీర్ బాబు సమ్మోహనం, అడవి శేష్ గూఢాచారి, కార్తికేయ ఆర్‌ఎక్స్100 వంటి పలు హిట్స్ వచ్చాయి. ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ కథానాయకుడు, రామ్ చరణ్, వినయ విధేయ రామ, వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ఎఫ్2, రజినీ కాంత్ పేట సినిమాలు విడుదలవబోతున్నాయి.

నెలాఖరున అఖిల్, మిస్టర్ మజ్ను, ఫిబ్రవరిలో ఎన్టాఆర్ మహానాయకుడు రిలీజవుతోంది. మహేష్ మహర్షి, నాని జెర్సీ ఏప్రిల్‌లో రానుండగా, మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సమ్మర్‌లో రిలీజ్ కానుంది. ఆగష్టు 15న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో అంటూ బాక్సాఫీస్‌పై దండయాత్ర చెయ్యనున్నాడు.

వీటితో పాటు, మొదటి మూడు, నాలుగు నెలల్లోనే నాగ చైతన్య మజిలీ, తమన్నా దటీజ్ మహాలక్ష్మీ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. గత సంవత్సరం నుండి నేర్చుకున్న పాఠాలను దృష్టిలో పెట్టుకుని, పొరపాట్లు జరగకుండా ఉండాలనీ, ఈ 2019లో టాలీవుడ్ సక్సెస్ రేట్ ఇంకా పెరగాలని ఇండస్ట్రీ అంతా కోరుకుంటుంది.