Rrr
RRR : రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ సినిమా మేనియా నడుస్తుంది. రాజమౌళి, చెర్రీ, తారక్ లు దేశంలోని ప్రధాన నగరాలన్నీ చుట్టేస్తూ భారీగా ప్రమోషన్స్ ని నిర్వహిస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.
ఇక ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం, థియేటర్స్ ఫైనల్ అవ్వడంతో అభిమానులు సందడి చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వేసే థియేటర్స్ వద్ద ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు భారీగా బ్యానర్లు, కటౌట్స్ కట్టి వారి అభిమానాన్ని చూపించుకుంటున్నారు. థియేటర్స్ ని ముస్తాబు చేస్తున్నారు అభిమానులు. బ్యానర్స్, పోస్టర్స్, కటౌట్స్ లతో థియేటర్స్ ని రెడీ చేసే పనిలో అభిమానులు బిజీ బిజీగా ఉన్నారు.
Keeravani : ఇప్పటి సింగర్స్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకి ఫేవరేట్ సింగర్స్ ఎవరో తెలుసా?
తాజాగా కోదాడలోని ఓ థియేటర్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో ఇద్దరి హీరోల అభిమానుల మధ్య వివాదాలు వచ్చి ఘర్షణ తలెత్తింది. ఇరు హీరోల అభిమానులు కొట్టుకునేదాకా వెళ్లారు. ఈ సమయంలో ఓ ఎన్టీఆర్ అభిమాని ఏకంగా పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో తోటి అభిమానులు, స్థానికులు అతడిని వారించి అడ్డుకున్నారు. థియేటర్ వద్ద ఘర్షణ జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఘర్షణకు కారణమైన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.