Copy content trolling on Shah Rukh Khan King movie teaser
Shah Rukh Khna: కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్. నవంబర్ 2 షారుఖ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. సినిమాలో కింగ్ తాలూకు క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ కట్ చేశారు. గ్రే హెయిర్ లో ఓల్డ్ గెటప్ లో నెక్స్ట్ లెవల్లో ఉన్నాడు షారుఖ్ ఖాన్. ఈ ఒక్క టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దీంతో, షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ (Shah Rukh Khna)దశలో ఉన్న కింగ్ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, అంతా బాగానే ఉంది కానీ. తాజాగా విడుదలైన “కింగ్” సినిమా టీజర్ పై కాపీ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Prasanth Varma: అవన్నీ అసత్య ప్రచారాలు.. వివాదంపై స్పందించిన ప్రశాంత్ వర్మ.. ప్రెస్ నోట్ విడుదల
అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాల నుంచి కాపీ కంటెంట్ తీసుకొని ఈ టీజర్ కట్ చేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఆ మూడు సినిమాలు మరేవో కాదు. ఒక హాలీవుడ్ మూవీ కాగా, ప్రభాస్ సాహో, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి కంటెంట్ కాపీ చేశారంటున్నారు. ముందుగా హాలీవుడ్ సినిమా విషయానికి వస్తే, కింగ్ సినిమా టీజర్ లో షారుఖ్ ఖాన్ కనిపించిన గెటప్, కాస్త్యుమ్స్ అచ్చం ఒక హాలీవుడ్ సినిమాలో ఉన్నట్టుగానే ఉన్నాయి. సేమ్ టూ సేమ్ దించేశారు లుక్.
ఇక సాహో సినిమాలో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తాడు. సినిమా విడుదల సమయంలో ఆ డైలాగ్ చాలా వైరల్ అయ్యింది. అదే “ఇట్స్ షో టైమ్” అనే డైలాగ్. ఇప్పుడు కింగ్ టీజర్ లో కూడా చివరలో సేమ్ అదే “ఇట్స్ షో టైమ్” అనే డైలాగ్ కొట్టాడు షారుఖ్. దాంతో, ఈ డైలాగ్ ప్రభాస్ ది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కింగ్ టీజర్ చివర్లో “దే కాల్ హిమ్ కింగ్” అని టైటిల్ వేశారు. ఇది చూడాగానే చాలా మందికి పవన్ కళ్యాణ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ఓజీ గుర్తుకురావడం ఖాయం. ఎందుకంటే ఓజీ సినిమా పూర్తి పేరు “దే కాల్ హిమ్ ఓజీ” కాబట్టి. అందులో ఓజీ తీసేసి కింగ్ అని యాడ్ చేశారు అంతే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మూడు సినిమాల నుంచి తీసుకున్న కంటెంట్ తో కింగ్ సినిమా టీజర్ విడుదల చేశారు అంటూ నెగిటీవ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ కాపీ కామెంట్స్ పై కింగ్ సినిమా మేకర్స్ ఏమంటారో చూడాలి.