Prasanth Varma: అవన్నీ అసత్య ప్రచారాలు.. వివాదంపై స్పందించిన ప్రశాంత్ వర్మ.. ప్రెస్ నోట్ విడుదల

దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి మధ్య వివాదం రాజుకున్న (Prasanth Varma)విషయం తెలిసిందే. తనతో సినిమాలు చేస్తానంటూ రూ.10 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడని, ఇప్పుడు చేయడం లేదని ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశాడు నిర్మాత నిరంజన్ రెడ్డి.

Prasanth Varma: అవన్నీ అసత్య ప్రచారాలు.. వివాదంపై స్పందించిన ప్రశాంత్ వర్మ.. ప్రెస్ నోట్ విడుదల

Director Prashanth Varma releases press note on controversy

Updated On : November 2, 2025 / 5:22 PM IST

Prasanth Varma: దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. తనతో సినిమాలు చేస్తానంటూ రూ.10 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడని, ఇప్పుడు చేయడం లేదని ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశాడు నిర్మాత నిరంజన్ రెడ్డి. (Prasanth Varma)ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో, దర్శకుడు ప్రశాంత్ వర్మ అధికారికంగా స్పందించాడు. దీనిపై సుదీర్ఘమైన ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.

Allu Arjun: ఈ అవార్డు నా అభిమానులకు అంకితం.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై అల్లు అర్జున్

‘‘ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఫిర్యాదు చేసినట్లు మీడియా పోర్టల్స్‌, సోషల్‌మీడియా వేదికగా ప్రచారమవుతున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఈ విషయంపై కొంత వరకూ స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ముందుగా ఇలాంటి ధ్రువీకరించబడని వార్తలను ప్రచారం చేయడాన్ని నేను ఖండిస్తున్నా. ప్రైమ్‌షో సంస్థకి నాకు మధ్య ఉన్న వివాదం ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. అలాగే, తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ పరిశీలనలో ఉంది. వారు ఈ వివాదంపై పూర్తి విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి, మీడియా దీనిపై వివాదాలు సృష్టించే ప్రయత్నం చేయవద్దు. నాపై వచ్చిన, వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. పూర్తిగా నిరాధారమైనవి. అసత్యమైనవి కూడా. మీడియా, సోషల్‌ మీడియా, డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్ కి నా విజ్ఞప్తి ఏంటంటే.. అసంపూర్ణమైన వార్తలను ప్రచారం చేయకండి” అని నోట్ లో పేర్కొన్నాడు ప్రశాంత్‌ వర్మ. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial)