కరోనా వైరస్ విజృంభిస్తోంది. హైదరాబాద్‌లో కూడా కరోనా కేసు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ప్రముఖుల చేత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందించే..రామ్ చరణ్ సతీమణి..ఉపాసన కరోనా వైరస్‌పై తగిన జాగ్రత్తలు చెప్పారు.
ఈమె అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు అనే సంగతి తెలిసిందే. ఎలాంటి ఆందోళన చెందాల్సినవసరం లేదని, వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. ఈ మేరకు ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు. సికింద్రబాద్ అపోలో ఆసుపత్రిలో కరోనా కేసును గుర్తించడం జరిగిందని, ఈ రోగిని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు చేపడుతోంది. ఎవరూ ఆందోళన చెందాల్సినవసరం లేదు అని తెలిపారు.
సూచనలు..జాగ్రత్తలు : –
* ఉడకబెట్టని మాంసం తినవద్దు
* వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. అయినా సరే మాస్క్‌లు ధరించడం మంచిది.
* వైరస్‌కు యాంటీ బయోటిక్స్ లేవు. వైద్యులు చెప్పకుండా ఎలాంటి మందులు వేసుకోవద్దు.
* జ్వరం, తలనొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, ఒళ్లునొప్పులు ఉంటే..వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
* బయట తిరగి వచ్చిన తర్వాత..శుభ్రంగా కడుక్కోవాలి.
* దగ్గు, తముళ్లు వచ్చే వాళ్ల నుంచి కనీసం 3 అడుగుల దూరంలో ఉండండి.
* వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండేందుకు ప్రయత్నించాలి.
Read More : కరోనా భయం : రూ. 1.60 మాస్క్..రూ. 20 పైనే!