CoronaVirus Second Wave: సినీ ఇండస్ట్రీపై కరోనా రెండో పంజా

టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా చిత్ర ప‌రిశ్ర‌మ‌పై కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతుంది. ఈ మహమ్మారి ప్రబలిన తొలి రోజుల్లో సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు షూటింగుల‌కే కాక ..

Coronavirus Second Wave

CoronaVirus Second Wave: టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా చిత్ర ప‌రిశ్ర‌మ‌పై కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతుంది. ఈ మహమ్మారి ప్రబలిన తొలి రోజుల్లో సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు షూటింగుల‌కే కాక అన్ని స‌మావేశాల‌కూ దూరంగా నిలిచారు. లాక్‌డౌన్ ప‌రిస్థితులు నెమ్మెదించాకే ఆ కొందరైనా బయటికొచ్చారు.

అప్పటి నుంచే సమస్య మొదలైంది. కొందరు ప్ర‌ముఖులకు కూడా కరోనా సోకింది. ఫామస్ సింగర్ ఎస్పీ బాలు క‌రోనా బారిన ప‌డి, అనారోగ్యంతో మ‌ర‌ణించారు. మెగాస్టార్ చిరంజీవికి కూడా మొద‌ట క‌రోనా పాజిటివ్ అని ప్రచారం జరిగినా.. సెకండ్ ఒపీనియన్ కోసం జరిగిన టెస్టుల్లో నెగిటివ్‌గా తేలింది.

ఫస్ట్ వేవ్ ప్రశాంతంగా ముగిసిందనుకుంటే.. సెకెండ్ వేవ్‌లో మ‌ళ్లీ సినీ ప్ర‌ముఖులపై కరోనా ఎఫెక్ట్ కనిపిస్తుంది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లో అమితాబ్, అభిషేక్, ఐశ్వ‌ర్య‌రాయ్ వంటి బాలీవుడ్ ప్ర‌ముఖులకు కూడా వైరస్ సోకింది. సెకెండ్ వేవ్‌లో వ‌రుస పెట్టి బాలీవుడ్ స్టార్లు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే అమీర్‌ఖాన్ ఆ త‌ర్వాత ప‌లువురు బాలీవుడ్ హీరోలకు క‌రోనా సోకిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదిలా ఉంటే వాళ్ల గ‌ర్ల్ ఫ్రెండ్స్ కు బెంగ పెరిగిపోయింది. ప్ర‌త్యేకంగా టెస్టులు చేయించుకుని కన్ఫామ్ చేసుకుంటున్నారు. తాజాగా అక్ష‌య్ కుమార్ కూడా జాబితాలో నిలిచాడు.

టాలీవుడ్‌కు కూడా సెకెండ్ వేవ్ క‌రోనా నుంచి త‌ప్పించుకోలేక‌పోతున్న‌ట్టుగా ఉంది. అల్లు అర‌వింద్, త్రివిక్ర‌మ్‌ల‌తో పాటు.. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ్డారు. న‌టి నివేదా థామ‌స్ క‌రోనా పాజిటివ్ గా వచ్చింద‌నే విష‌యాన్ని ప్ర‌క‌టించింది.

ఆమెతో పాటు వ‌కీల్ సాబ్ ప్ర‌మోష‌న్లో పాల్గొన్న న‌టీన‌టులు ఇప్పుడు టెస్టులు చేయించుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ట్టుగా ఉంది. మొత్తానికి క‌రోనా ప‌రిస్థితుల్లో సినిమాల షూటింగుల్లో పాల్గొని, త‌మ సినిమాల రిలీజ్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్న వాళ్ల‌ను క‌రోనా క‌ల‌వ‌ర పెడుతున్న‌ట్టుగా ఉంది.